జర్నలిస్టులకు అండగా టీయూడబ్ల్యుజే హెచ్ 143 : జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జూకంటి అనిల్, దుడుక రామకృష్ణ

టియుడబ్ల్యూజే(హెచ్ 143) భువనగిరి నూతన అధ్యక్ష కార్యదర్శులుగా కె రాజు, బి మల్లేశం

జనం సాక్షి /భువనగిరి: ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ నాయకత్వంలో టీయూడబ్ల్యూజే(హెచ్‌143) జర్నలిస్టులకు అండగా నిలిచి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నదని జిల్లా అధ్యక్షుడు జూకంటి అనిల్, ప్రధాన కార్యదర్శి దుడుక రామకృష్ణ అన్నారు. బుధవారం టియుడబ్ల్యూజే(హెచ్ 143) జిల్లా అధ్యక్షుడు జూకంటి అనీల్ ప్రధాన కార్యదర్శి దుడుక రామకృష్ణ, యూనియన్ సీనియర్ నాయకుల సమక్షంలో భువనగిరి నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవం చేశారు. అన్ని పత్రికలు, అని వర్గాల జర్నలిస్టులకు కమిటీలో చోటు దక్కిందని రానున్న రోజుల్లో ప్రతి జర్నలిస్టు సోదరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ సహాకారంతో జిల్లాలో యూనియన్ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా భువనగిరి కమిటీ అధ్యక్షులుగా కురిమిండ్ల రాజు,ప్రధానకార్యదర్శి బోయిని మల్లేశం లు మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా బండారు స్వామి లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు ఉపాధ్యక్షులుగా భానోతు చకృ, పి బలరాం రెడ్డి, పి బాలరాజు, ఏం డి ఇస్తీయక్, సహాయ కార్యదర్శి ఎస్ కుమార్, బి సిరిల్ బాబు, ప్రచార కార్యదర్శి సిద్దుల శివ, మండల కార్యవర్గ సభ్యులు అర్ నవిన్, పి రమేష్ , నరసింహ, యన్ శ్రీశైలం, మహేష్,గడ్డం సత్యానారయణ, రేపాక సురేష్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ఎండి ఇంతీయజ్, బొడిగే దిలీప్ గౌడ్ లను జిల్లా కమిటి లోకి తీసుకుంటున్నట్లు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జూకంటి అనీల్, దుడక రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు ఎం.డి ఖాజా, గోవర్థన్ చారీ, కేతావత్ తిరుపతి నాయక్, ఎం.డి హమీద్ పాషా, బూడిద శ్రీహరి తదితరులు పాల్గొన్నారు