భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారంతో పాటు ఇంటి స్థలాలు: నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి.
*నర్సాపూర్ ఆర్డీవో కొల్చారం తాసిల్దార్ తో కలిసి అప్పాజీపల్లి గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే.
జనం సాక్షి /కొల్చారం
మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారి నిర్మాణంలో అప్పాజీపల్లి గ్రామంలో భూములు కోల్పోయిన ఇంటి స్థలాలపాటు రైతులకు ఇంటి స్థలాలతో పాటు నష్టపరిహారం అందించనున్నట్లు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు.
గురువారం సాయంత్రం నర్సాపూర్ ఆర్డిఓ శ్రీనివాసులతో కలిసి అప్పటి పల్లె గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో జాతీయ రహదారి ఏర్పాటుతో భూములు కోల్పోయిన రైతులతో సమావేశం అయ్యారు. గ్రామంలో పాఠశాల సమీపంలోని ప్రభుత్వ భూమి కోల్పోయిన రైతులకు కేటాయించడంతోపాటు నలభై మందికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొల్చారం మండలం కు చెందిన ముగ్గురు విలేకరులు ఎందుగుల నవీన్, పాల్వంచ ప్రతాప్ గౌడ్, తడకల శ్రీధర్ లకుఇండస్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గౌరీ శంకర్, కొల్చారం అప్పాజీపల్లి పోతంశెట్టిపల్లి చిన్న గణపురం సర్పంచులు ఉమా రాజా గౌడ్, చలం ఝాన్సీ యాదగిరి ఇందిరా ప్రియదర్శిని సందీప్, నాగరాణి నర్సింలు కిష్టయ్య మాజీ సర్పంచులు యాద గౌడ్ యాదయ్య , టిఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు వెంకట్ గౌడ్ జిల్లా నాయకులు రవితేజ రెడ్డి ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్, డైరెక్టర్ తుక్కాపూర్ ఆంజనేయులు, ఏడుపాయల మాజీ డైరెక్టర్ గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.