రంగశాయిపేటలో బొడ్రాయి ప్రతిష్టాపనకు సన్నాహాలు

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 16 (జనం సాక్షి)నగరంలోని రంగశాయిపేటలో గ్రామ దేవత బొడ్రాయి ప్రతిష్టాపనకు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి రంగశాయిపేట యూత్ ఫోర్స్(ఆర్ వై ఎఫ్) ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాల నాయకులతో వివిధ వర్గాలతో కలిసి కాంక్ష ఫంక్షన్ హాల్లో కొల్లూరి యోగానంద్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వేద బ్రాహ్మణులు వెలిదే భార్గవ శర్మ, ప్రదీప్ శాస్త్రిలు బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాలను వివరించారు. అత్యంత వైభవంగా నిర్వహించుకునే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ పాల్గొనాలని తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమ వివరాలను త్వరలోనే తెలుపుతామని చెప్పారు. కొల్లూరి యోగానంద్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా గ్రామంలోని ప్రతి ఒక్కరు బొడ్రాయి ప్రతిష్టాపన లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేడల పద్మజనార్ధన్ మాట్లాడుతూ బొడ్రాయి ప్రతిష్టాపన ద్వారా గ్రామ ప్రజలు ఐకమత్యాన్ని చాటాలని తెలిపారు. గుండు పూర్ణచందర్ మాట్లాడుతూ బొడ్రాయి ప్రతిష్టాపనకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, ప్రజలందరూ సంతోషంగా ఒక శతాబ్దం పాటు ఉత్సవాల గురించి చెప్పుకునే విధంగా నిర్వహించుకోవాలని గ్రామ ప్రజలను కోరారు.తేది:01-03-2024, శుక్రవారం రోజున ప్రతిష్టాపనకు వేద బ్రాహ్మణులు ముహూర్తం ఖరారు చేశారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు ఐదు రోజులపాటు గ్రామదేవత ప్రతిష్టాపన ఉత్సవాలను అంగరంగ వైభవంగా చేయనున్నారు. ఈ 5 రోజులపాటు గ్రామంలో ఎలాంటి శుభకార్యాలు చేపట్టకూడదని వేద బ్రాహ్మణులు సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్ వై ఎఫ్ సభ్యులతో పాటు స్థానిక 42 వ డివిజన్ కార్పొరేటర్ గుండు చందనా పూర్ణచందర్, కొల్లూరి యోగానంద్, కేడల పద్మ జనార్ధన్, గండ్రాతి కుమార్, శేర్ల అనిల్ కుమార్, చిమ్మని రవీందర్, నాయిని అశోక్, శంకేశి వెంకటేశ్వర్లు, శ్రీనివాసమూర్తి, రాజేందర్, రాజేష్, రామానుజం జగదీశ్వర్, చాపల నాగరాజు, శ్రీరాముల వెంకటేశ్వర్లు, మునుకుంట్ల ఆగయ్య, కత్తెరపల్లి నవీన్, ఆవునూరి రవి, కుమారస్వామి, రావుల ప్రవీణ్, దామెరకొండ కరుణాకర్, గజ్జె సురేష్ బాబు, పరికిపండ్ల రాజు, కర్ర కుమార్, శ్రీపాద మనోహర్, హరిప్రసాద్, బేల శ్యామ్, రాగి నాగరాజు, మండల సీతారాములు, శ్రీనివాసు, రాములు, మొగిలి, దున్నాల శ్రీనివాసు, విజయ్ కుమార్,గుండు నవీన్, జక్కం దామోదర్, బక్కీ రవి, వేణు, రంజిత్, ఆరె కార్తీక్, తాళ్లపల్లి అర్జున్, ఇటికాల అశోక్, బజ్జూరి వీరేశం, శ్రీరామోజు మోహనా చారి, అనుమాస కామేశ్వర్, విలాసాగరం భాస్కర్, చిన్న శ్రీనివాస్, గుర్రం రామచందర్, గంగిశెట్టి శ్రీనాథ్,దామరకొండ రాజేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు