24నుంచి శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

భారీగా ఏర్పాట్లు చేస్తున్న టిటిడి అధికారులు
వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా సేవల సమాచారం
తిరుమల,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు  ఈ నెల 24 నుంచి జరుగనున్నాయి. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని టిటిడి తిరుపతి జెఈవో బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. బ్ర¬్మత్సవాల ఏర్పాట్లపై జెఈవో అధికారులతో  సవిూక్ష సమావేశం నిర్వహించారు.   ఫిబ్రవరి 24వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై మార్చి 4వ తేదీన ధ్వజావరోహణంతో ముగియనున్నాయి.  తిరుమల బ్ర¬్మత్సవాలను తలపించేలా ఏర్పాట్లు నిర్వహించాలని ఆదేశించారు. ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పుష్పాలంకరణలు, ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ముందస్తుగా క్యూలైన్లు, చలువపందిళ్లు, అన్ని కూడళ్లలో ప్లెక్సీ బోర్డులు, విద్యుత్‌ విభాగం ఆధ్వర్యంలో వివిధ దేవతామూర్తుల కటౌంట్లు, దేదీప్యమానంగా విద్యుద్దీపాలంకరణలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చంద్రగిరి, తిరుపతిలలో బ్ర¬్మత్సవాల కటౌట్లు ఏర్పాటు చేయాలన్నారు. వాహనసేవల వివరాలతో పుస్తకాలు ముద్రించి, భక్తులకు అందిచాలని, పుస్తక విక్రయశాల తొమ్మిది రోజుల పాటు ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రచార రథాల ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు.  బ్ర¬్మత్సవాలలో అవసరమైనంత మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచాలని ప్రజాసంబంధాల అధికారికి సూచించారు. వాహన సేవలను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు. శ్రీవారి బ్ర¬్మత్స వాలలో రోజువారి వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఫిబ్రవరి 28వ తేదీన గరుడసేవ రోజున అలంకరించేందుకు లక్ష్మీహారం శోభాయాత్ర, గోదాదేవి మాలలను ఊరేగింపుగా తీసుకొచ్చే మార్గాలను ముందస్తుగా పరిశీలించాలన్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్‌.వి. సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు, వాహనసేవల ముందు భజనలు, కోలాటాలు ఏర్పాటుచేయాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా స్వామివారి ప్రసాదం కౌంటర్లను పెంచాలన్నారు. మొబైల్‌ మరుగుదొడ్లు, అదనపు పారిశుద్ద్య కార్మికులను నియమించాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, ్గ/ర్‌ఇరజన్లు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. టిటిడి విజిలెన్స్‌ అధికారులు, పోలీసులు సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. సమావేశం అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి పరిశీలించారు.
అంతకుముందు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్ర¬్మత్సవాల గోడపత్రికలు, కరపత్రాలను టిటిడి లక్ష్మీకాంతం  ఆవిష్కరించారు. భక్తులకు వేగంగా దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి జరుగనున్న గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తిరుమల శ్రీవారి ఆలయం నుండి లక్ష్మీహారాన్ని శోభాయాత్రగా తీసుకురానున్నట్లు తెలిపారు. శ్రీ కల్యాణ  వేంకటేశ్వరస్వామివారి బ్ర¬్మత్సవాల పేరిట టిటిడి అధికారులతో వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి, ఇందులో భక్తులకు అవసరమైన సౌకర్యాలు, ఇతర ఇబ్బందులు అధికారులందరికి తెలుస్తుందని, తద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వాహనసేవలు ఉదయం 8
నుంచి 9 గంటల వరకు, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు జరుగనున్నాయని, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి, అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని జెఈవో కోరారు. ఈ సమావేశంలో స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవోలు ధనంజయులు, ఝూన్సీరాణి,  హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి డా|| రమణప్రసాద్‌, విజివో అశోక్‌కుమార్‌ గౌడ్‌, ఏఈవో లక్ష్మయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.