24 గంటల్లో 51 మంది మృతి

దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కేసుల సంఖ్య

దిల్లీ, ఏప్రిల్ 13(జనంసాక్షి): దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల రోజురోజు కూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో (సోమ వారం సాయంత్రం 5 వరకు) కొత్తగా 905 కేసు లు నమోదు అయ్యాయని, 51 మరణాలు సంబ వించాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడిం చింది. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 324కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 9,352కు చేరిందని తెలిపింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 8048 మంది 24 గంటల్లో 51 మంది మృతి చికిత్స పొందుతుండగా.. 979 మంది డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే దాదాపు 2 వేల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. దిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, నాడు. రాజసాన్. మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 563కి చేరింది. అటు ఏపీలోనూ 432 కేసులు నమోదయ్యాయి. మరోవైపు మరోసారి లాక్ డౌన్ విధించేందుకు కేంద్రం సిద్ధమైంది. రేపు ఉదయం ప్రధాని మోదీ లా డౌన్‌కు సంబంధించిన ప్రకటన చేయనున్నారు. కరోనా వైరస్ కట్టడికి తెలంగాణమహారాష. బెంగాల్ లా డౌనను ఈ నెలాఖరు వరకు తమిళనాడు కూడా ఆ జాబితాలో చేరింది.