27పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబాయి: టెలికాం రంగ షేర్లు, వినియోగవస్తువుల రంగానికి చెందిన షేర్లు రాణించడంతో భారతీయస్టాక్‌ మార్కెట్‌ మంగళవారం లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 26.73పాయిట్ల ఆధిక్యంతో 17425.71వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 9.35పాయింట్ల లాభంతో 5287.95వద్ద ముగిశాయి. భారతీ ఎయిర్‌టెల్‌, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కోల్‌ ఇండియా తదితర కంపెనీలకు చెందిన షేర్లు లాభాలతో ముగిశాయి.