29న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని వనపర్తి రాక

వనపర్తి సెప్టెంబర్ 25 (జనం సాక్షి)సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ఈనెల 29వ తేదీన జిల్లా వనపర్తి వస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి కే. విజయరాములు తెలిపారు. ఆయనతోపాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ బాల నరసింహ కూడా పాల్గొంటారని తెలిపారు. ఆదివారం వనపర్తి లో విలేకరులతో మాట్లాడారు శంషాబాద్ సిపిఐ రాష్ట్ర మహాసభలో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సాంబశివరావు తొలిసారి వనపర్తి జిల్లాకు వస్తున్న సందర్భంగా ఆరోజు వనపర్తి సిపిఐ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, పరిష్కారానికి చేపట్టవలసిన పోరాట కార్యక్రమాలు, జిల్లాలో పార్టీ, ప్రజా సంఘాల ప్రతిష్టత, విస్తరణ తదితర అంశాలను చర్చిస్తారని తెలిపారు. ఎంతో ప్రాధాన్యత గల ఈ సమావేశానికి జిల్లా కౌన్సిల్ సభ్యులు, మండల కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు, గ్రామ శాఖల కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు, పార్టీ అనుబంధ ప్రజాసంఘాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు. సకాలంలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.
రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కమ్యూనిస్టులు టిఆర్ఎస్కు అమ్ముడు పోయారని విమర్శించటం సిగ్గుచేటని, తీవ్రంగా ఖండించారు. అధికార వ్యామోహంతో ఇప్పటికే పలు పార్టీలు మారిన ఆయనకు కమ్యూనిస్టులను విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు చేసిన తప్పుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.