పాండేను ఈ నెల 29 వరకు అరెస్టు చేయవద్దు :ఆదేశించిన సుప్రీం కోర్టు
ఢిల్లీ: ఇష్రాత్ జహాన్ కేసులో పీపీ పాండేను ఈ నెల 29 వరకు అరెస్టు చేయవద్దని సీబీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. తనపై ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలన్న ఐపీఎస్ అధికారి పీపీ పాండే అభ్యర్థనపై ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 29న అహ్మదాబాద్ కోర్టులో విచారణకు హాజరు కావాలని పాండేను ఆదేశించింది.