3జిలాల్లో వికటించిన ఐరన్‌ మాత్రలు

హైదరాబాద్‌: ప్రభుత్వం విద్యార్థులకు సరఫరా చేసిన ఐరన్‌ మాత్రలు వికటించి మూడు జిల్లాలో విద్యార్థులు అస్వస్థత పాలయ్యారు. కర్నూలు, నిజామాబాద్‌, కృష్ణా జిల్లాల్లో ఈ సంఘటనలు జరిగాయి. కర్నూలు జిల్లాలోని పెద్ద హరివనం, కోడుమూరు, ఆదోని ఆస్పరి వసతిగృహాల్లో విద్యార్థులు ఈ మాత్రలు వేసుకోగానే వాంతులు, కడుపునొప్పి రావటంతో ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్‌ జిల్లాలోని అల్లాపూర్‌ ప్రభుత్వ వసతిగృహంలో ఐరన్‌ మాత్రలు వేసుకున్న ఏడుగురు బాలికలు అస్వస్థత పాలయ్యారు. వారిని ఆసుపత్రిలో చేర్చారు. కృష్ణా ఫ్రాన్సిన్‌ వసతిగృహంలో 8మంది విద్యార్థులు మాత్రల వల్ల అస్వస్థత పాలయ్యారు.