30వ రోజుకు చేరిన సామూహిక దీక్షలు

అదిలాఆబద్‌/కలెక్టరేట్‌: తమ కాలనీల్లో విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ పట్టణ శివారులోని దాజీనగర్‌, శాస్త్రీనగర్‌ కాలనీవాసులు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. గురువారంతో ఈ దీక్షలు 30వ రోజుకు చేరాయి. దీక్షల్లో సాహెబ్‌రావు, నారాయణ, శీవాజీ, శివరాజ్‌లు కూర్చున్నారు. రక్ష బంధన్‌ పండుగ రోజు సైతం ఈ పేదలు తమ సమస్య తీర్చాలని కోరుతూ నిరసన తెలిపారు. తమ కాలనీలకు విద్యుత్తు సౌకర్యం సమకూరినప్పుడే తమకు పండుగని వారు పేర్కొంటూ అధికారుల వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు.