30న కురుమ గర్జన విజయవంతం చేయాలి : రామకృష్ణ
వరంగల్, జనవరి 20 (): జనగామలో ఈ నెల 30న జరిగే కురుమ గర్జన విజయవంతం కోసం మండలంలోని కురుమలు కృషి చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కురుమలు అన్ని రంగాల్లో వెనకబాటు తనానికి గురవుతున్నారన్నారు. ఎస్టీ జాబితాలో కురుమలను చేర్చాలని ఎంతో కాలంగా కోరుతున్న పాలకుల్లో చలనం లేదన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే కురుమ వ్యక్తి లేకపోవడం విచారకరమన్నారు. జనగామలో జరిగే కురుమ గర్జనతో అన్ని రాజకీయ పార్టీలకు ఒక సంకేతం పంపాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గటయ్య, దేవేందర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.