30న విచారణకు హాజరు కావాలి
మంథని, ఆగస్ట్ 28 (జనంసాక్షి):- మంథని ఎంపిడిఓ, మంథని మండల పంచాయతీ అధికారి ఈ నెల 30న స్వయంగా విచారణకు హాజరు కావాలని సమాచార కమిషన్ నోటీసులు పంపినట్లు మాజీ మంథని ఉపసర్పంచ్ ఇనుముల సతీష్ పాత్రికేయులకు ఒక ప్రకటలో తెలిపారు. ఆదివారం పాత్రికేయులకు తెలిపిన ప్రకటనలో ఆయన వివరిస్తూ…….మంథని మండలం లోని సూరయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 2018 జనవరి నుండి 2022 జనవరి వరకు గ్రామంలో నూతన గృహ నిర్మాణ అనుమతుల రిజిస్టర్, తీర్మానాల రిజిస్టర్, అనుమతి పొందిన రియల్ ఎస్టేట్ వెంచర్ల వివరాలు, ప్లాట్లుగా మారిన వ్యవసాయ భూముల వివరాల విషయాలపై సమాచారం కోరుతూ 2022 జనవరి 10న మంథని మండల పంచాయతీ అధికారి గారికి దరఖాస్తు చేయగా అసంపూర్తిగా సమాచారం ఇచ్చినందున మంథని ఎంపిడిఓ 2022 ఫిబ్రవరి 28న అప్పీల్ చేయడం జరిగిందని, ఆతర్వాత కూడా పూర్తి సమాచారం ఇవ్వనందున రాష్ట్ర కమిషన్ గారికి అప్పీల్ చేయడం జరిగడంతో, ఈ మేరకు స్పందించిన రాష్ట్ర సమాచార కమిషన్ ఈనెల 30తేదీ మంగళవారం రోజున మంథని ఎంపిడిఓ, మంథని మండల పంచాయతీ అధికార్లు స్వయంగా హాజరు కావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.