31వ రోజు టీఆర్‌ఎస్ పల్లెబాట
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్ చేపట్టిన పల్లెబాట 31వ రోజుకు చేరుకుంది. గ్రామాల్లో టీఆర్‌ఎస్ పల్లెబాట జోరుగా కొనసాగుతోంది. కాళాకారుల ఆటపాటలతో , జై తెలంగాణ నినాదాలతో పల్లెలన్ని మార్మోగుతున్నాయి. వీధుల్లో గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. గ్రామాగ్రామాన పార్టీ జెండాలు ఎగురవేసి తెలంగాణ అవశ్యకతను టీఆర్‌ఎస్ నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. తెలంగాణకు అడ్డుపడుతున్న సీమాంధ్ర పార్టీల నేతలను గ్రామాలకు రానివొద్దని ప్రజలకు పిలుపునిస్తున్నారు.