35 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో బీటీ రోడ్లు
శివ్వంపేట సెప్టెంబర్ 1 జనంసాక్షి : గ్రామీణ రోడ్లను నందనవనంగా మార్చడానికి నియోజవర్గానికి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు చొరవ తో రూ. 35 కోట్లు మంజూరైనట్లు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చంది జెఎస్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటుగా నూతనంగా మండలానికి మంజూరైన పింఛన్ ధృవపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీల పోరం జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ 57 సంవత్సరాలు ఉన్న ప్రతిఒక్క అర్హుడికి పింఛన్ వచ్చేలా కృషి చేస్తాననీ, శివ్వంపేట మండలానికి 848 పింఛన్లు కొత్తగా వచ్చాయని మిగిలిన మరో 150 పింఛన్లను, అలాగే నియోజకవర్గంలోని అన్ని మండలాల పింఛన్లను కలిపి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోయి ప్రతి ఒక్కరికి పింఛన్ వచ్చేలా కృషి చేస్తానన్నారు. కెసిఆర్ హయంలో రైతులకు 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతు బీమా, ఇస్తున్నామన్నారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్టు వంటి పథకాలతో ఆడబిడ్డలను ఆదుకుంటున్నామన్నారు. నవాబుపేట, పాంబండ రోడ్లను రీబీటీ రోడ్లుగా మార్చి, నియోజకవర్గంలో కొత్తగా బీటీ రోడ్లను వేయనున్నామనీ ఇప్పటికే సంబంధిత గుత్తేదారు తో మాట్లాడడం జరిగిందన్నారు. త్వరలోనే నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ లో అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోకుండా, విద్యుత్ సరఫరా లో అంతరాయం కలగకుండా ఆదేశాలిస్తామన్నారు. రైతులెవ్వరూ అధైర్య పడవలసిన అవసరం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గత 8 సంవత్సరాల నుంచి ప్రశాంత వాతావరణంతో ఉన్న రాష్ట్రంలో అలజడి, అల్లర్లు సృష్టించి, మతోన్మాద శక్తులను రెచ్చగొట్టి, తద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలని, మతతత్వ పార్టీ అయిన బిజెపి భావిస్తుందని ఎమ్మెల్యే విమర్శించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, ఎప్పటికప్పుడు వారి కుట్రలను తిప్పికొట్టాలని మదన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ రోజు యావత్ భారతదేశం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కేసీఆర్ కోసం ఎదురు చూస్తుందన్నారు. అందులో భాగంగానే దేశంలోని వివిధ రాష్ట్రాల చెందిన రైతులు సీఎం కేసీఆర్ ను కలిసి దేశానికి నాయకత్వం వహించాలని కోరడం జరుగుతుందన్నారు. అనంతరం డిఆర్డిఏ పిడి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాకు కొత్తగా 20,250 పెన్షన్లు మంజూరు కావడం జరిగిందని చెప్పారు. మరికొందరి లబ్ధిదారుల అకౌంటు, ఆధార్ ఇతర సాంకేతిక కారణాల నిలిచిపోయాయని, వాటిని కూడా సరిదిద్ది అందరికీ వచ్చేలా చూస్తామన్నారు. అంతకుముందు ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, మండల పార్టీ అధ్యక్షుడు రమణా గౌడ్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రమాకాంత్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు లావణ్య మాధవరెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంసానిపల్లి నరసింహారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు బానోత్ రవి నాయక్ లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్ చారి, ఎంపీడీవో కాసం నవీన్ కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు లాయక్, హరికిషన్ రావు, శ్రీనివాస్ గౌడ్, తాటి పవన్ గుప్తా, రాజశేఖర్ గౌడ్, రాజం బిక్షపతి, పూల్ సింగ్, సంజీవ చారి బుచ్చిరెడ్డి, వర్రె శ్రీనివాస్ యాదవ్ లతో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ తర్వాత కొత్తగా ఆత్మ కమిటీ చైర్మన్గా ఎన్నికైన గొర్రె వెంకట్ రెడ్డి తోపాటుగా డైరెక్టర్లను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు.