37 వ సాకలి ఐలమ్మ వర్ధంతి

జైనథ్ జనం సాక్షి సెప్టెంబర్ 10
జైనథ్ మండల కేంద్రంలో 37వ చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో చాకలి ఐలమ్మ స్ఫూర్తి పోరాటాన్ని గురించి ఈ సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం 1940 తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజా ఉద్యమాల్లో పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని బిఎస్పి జిల్లా అధ్యక్షులు గడువు మహేందర్ అన్నారు. చాకలి ఐలమ్మ పోరాటాన్ని ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఈ సమాజంలోని పేద వర్గాలను బహుజనులను చైతన్యం చేసి రాజ్యాధికారం వైపు పయనింప జేస్తము అని అన్నారు. అదేవిధంగా రజక సంఘం మండల నాయకులు రాజు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఓబీసీ సంఘం మండల అధ్యక్షులు పిడుగు స్వామి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో చూపిన పటిమ ఈ సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. అదేవిధంగా వీఆర్ఏ మండల అధ్యక్షులు సంతోష్ గారు మాట్లాడుతూ వీఆర్ఏల హక్కులను సాధించుట కొరకు, మా బహుజన వీరవనిత ఐలమ్మ ను స్ఫూర్తిగా తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో బిఎస్పి నాయకులు అసెంబ్లీ ఇంచార్జ్ మిలింద్ కుమార్, అదిలాబాద్ అసెంబ్లీ అధ్యక్షులు రాజ్ కుమార్, బోత్ అసెంబ్లీ ఇంచార్జ్ చరణ్ దాస్, జైనత్ మండల కన్వీనర్ రావుల పోచన్న, బిఎస్పి నాయకులు సంతోష్, నరేష్, దత్తు, శివ.సునీల్. జైనథ్ మండల్ మైనార్టీ సెల్ నాయకులు సర్పరాజ్, VRA ల జేఏసీ నాయకులు , దేవన్న ,అనిల్, కమలం , సువర్ణ , వెంకన్న , నందు , వెంకటరమణ, దేవన్న.రజక సంఘం నాయకులు రామన్న, వికాస్ పోచ్చన్న .గ్రామ ప్రజలు పాల్గొని చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు