4న బూత్‌లెవల్‌ నాయకులకు శిక్షణ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 : డిసెంబర్‌ 4వ తేదీన బాన్సువాడ నియోజకవర్గంలోని యువజన కాంగ్రెస్‌ బూత్‌లెవల్‌ నాయకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు యువజన కాంగ్రెస్‌ బాన్సువాడ నియోజకవర్గ అధ్యక్షుడు రాజరెడ్డి తెలిపారు. వర్ని మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని బూత్‌లెవల్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులకు ఈ శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ ఆద్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ శిక్షణ కార్యక్రమం వివరిస్తారని తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల బూత్‌లెవల్‌ నాయకులు శిక్షణ తరగతులకు తప్పకుండా హాజరై విజయవంతం చేయాలని సూచించారు. విలేకరుల సమావేశంలో నాయకులు ఇందూరు సాయిలు, కొత్తొల్ల రాములు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.