4 కోట్ల విలువైన శెనగలు స్వాధీనం

కర్నూలు: కర్నూలు జిల్లా ఆదోని మండలం దానాపురంలో విజిలెన్స్‌ అధికారులు ఈ రోజు దాడులు నిర్విహించారు. గణేశ్‌ గోదాంలో చేపట్టిన తనిఖీల్లో రూ. 4 కోట్ల విలువైన 15,489 బస్తాల పప్పు శెనగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.