క్షిణ గుజరాత్‌లో 4 రోజులుగా ఎడతెగని వానలు

మురాదాబాద్‌, జులై 20 : గత నాలుగు రోజులుగా దక్షిణ గుజరాత్‌లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదలతో పలు ప్రాంతాల్లో తీవ్రప్రభావం పడింది. భారీ వర్షాలకు వల్సాడ్‌ జిల్లాలో ఓ వంతెన నీట మునిగింది. పలు గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విత్యుత్‌, సమాచార వ్యవస్థలకు ఆటంకం ఏర్పడింది.
వంతెనపై వరద ఉధృతి అధికంగా ఉండడంతో వంతెపై నుంచి వెల్లడానికి వాహనదారులు భయపడుతున్నారు. ఒక ట్రక్‌ వంతెనపైనే చిక్కుకుపోయింది. వరద ఉధృతికి భయపడిన ట్రక్‌ డ్రైవర్‌ వాహనాన్ని అక్కడే వదిలివేసి ప్రాణాలతో బయటపడ్డాడు. కాసేపడికే ట్రక్కు నదిలో పడిపోయింది. వల్సాడ్‌ జిల్లాలో వంతెన నీట మునగడంతో ఆ పరిసరాల్లోని 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాకాలంలో ఈ సమస్య పునరావృతం అవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఈ వంతెన ఎత్తు తక్కువగా ఉండడంవల్లే తరచు సమస్యలు వస్తున్నాయని, వంతెన ఎత్తు పెంచాలని గ్రామస్తులు కోరుతున్నారు.