రూ.40లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత

హైదరాబాద్‌ : చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద రూ.40లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మినీలారీలో 101 ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తుండగా భాకారాపేట వద్ద దాడి చేసి పట్టుకున్నారు. ఎర్రచందనం దుంగలు, మినీలారీని స్వాధీనం చేసుకుని, ఇద్దర్ని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

తాజావార్తలు