416 మంది అగ్నిమాపక సిబ్బంది పాసింగ్‌ అవుట్‌ పెరేడ్‌

హైదరాబాద్‌: జాతి ఆస్తుల పరిరక్షణలో సీఐఎస్‌ఎఫ్‌ అగ్నిమాపక విభాగం నిర్వర్తించిన ధీరొదాత్త సేవల్ని కొనసాగించాలని ఆ సంస్థ ప్రత్యేక డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌ ఆర్‌ వర్మ ఆకాంక్షించారు. హకీంపేటలోని జాతీయ సీఐఎస్‌ఎఫ్‌ అకాడెమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 416 మంది అగ్నిమాపక సిబ్బంది పాసింగ్‌ అవుట్‌ పెరేడ్‌లో ఆయన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ప్రమాదంలో చిక్కుకున్న భాధితులను రక్షించడంలో అగ్నిమాపక సిబ్బంది చూపే చొరవ, ధైర్య సాహసాలు వెలకట్టలేనివని వర్మ అన్నారు. శిక్షణలో ప్రతిభ కనబర్చిన సిబ్బందిని ఆయన సత్కరించారు.