కరువొచ్చింది బాంచెన్…
గంగాధర, డిసెంబర్ 22 (జనంసాక్షి):
(తాళ్ల రమేశ్)
‘ఇయ్యెడు వానలు సక్కగ పడలే. అదను తప్పినంక కొద్దిగ పడ్డ పంటలకు అక్కరకు రాలే. సలికాలం గూడ ఎండకాలం లెక్క ఎండ మండుతంది. బా యిల్ల కొద్దిగనే నీళ్లున్నాయి. వాటితోటి ఒక్క దొ య్యగూడ పారుతలేదు. ఆ కొద్ది నీళ్లనే వరుస తల్ల లెక్క పెట్టి పంటలు పండించుకుంటున్నం. యేడి కెళ్లి జూసిండ్రు. చంద్రబాబు పాదయాత్ర జేత్తుం డట ఆయన నడిసే బాటల దుమ్ము లెయ్యద్దని తెలుగుదేశపోల్లు బాయిళ్ల కాడికి అచ్చి మమ్ములను జబర్దస్తీ జేసి నీళ్లు నింపుకపోయిండ్రు. ఆయిన ఎవ్వల కోసం నడుస్తుండు.. మాకేమత్తంది. ఎందు కు మా నీళ్లను దొంగతనం జేసుడు. చంద్రబాబే మా నీళ్లను ఎత్తుకపోయిండు. కుర్సీ మీద కూసు న్నన్ని రోజులు మాకు ఏమంటే ఏం చెయ్యలే. సరిగ వానలు పడక, పండిన పంటకు ధర లేక అడ్డగోలుగా అమ్ముకున్నం. ఇప్పుడు మళ్ల అతి కారం కోసం నడుస్తున్నడట. ఆయన మళ్ల కుర్సె క్కుతే ఇంకేమన్న ఉన్నదా? ఏం లేనప్పుడే మా అసోంటి బక్కోల్ల పొట్టగొడ్తుండు.ఇంకా ఆయినగినుక గద్దెమీద గూసుంటే వాళ్ల పార్టోళ్లు ఎవ్వలను బతుకనియ్యరు. నోటికాడి కూడు గుంజుకుంటు న్నరు. దూపకు మమ్ములను సంపుతరు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామా నికి చెందిన సుంకె లచ్చయ్య అనే రైతు. ఆయన ఒక్కరే కాదు బాబు పాదయాత్ర చేసిన మార్గంలోని గ్రామాల్లోని పదుల సంఖ్యలో రైతులది ఇదే పరిస్థితి. వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబునా యుడు బాధన్‌కుర్తి వంతెన మీదుగా ఏడు రోజుల క్రితం జిల్లాలో ప్రవేశించారు. కోరుట్ల, జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గాల్లో యాత్ర సాగింది. బాబుకు మోకాళ్ల నొప్పులున్నాయని, తారు రోడ్డుపై యాత్ర సాగిస్తే నొప్పులు మరింత ఎక్కువైతాయని వైద్యులు హెచ్చరించారు. మట్టిరో డ్డుపైనే నడవాలని సూచించారు. అప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఒక్కో రోజు ఆయన పాదయాత్ర సాగే దారిలో టీడీపీ శ్రేణులు 14 ట్యాంకర్ల ద్వారా 14 లక్షల లీటర్ల నీటిని తెప్పించి రోడ్డుపై చల్లుతున్నారు. చంద్రదండు, స్థానిక టీడీపీ నాయకులు ఈ వ్యవహారంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. వారు దండయాత్రల రైతుల వ్యవసాయ బావుల వద్దకు చేరుకుని ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తున్నారు. బావుల వద్దకు వెళ్లేందుకు రోడ్లు లేకపోతే పంటపొలాలోంచి వాహనాలను నడిపిసు ్తన్నారు. దీంతో చేలు మొత్తం ధ్వంసమవుతున్నాయి. ‘ఎంక ిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు’ బాబు యాత్ర తెలంగాణ రైతుల చావుకు వచ్చింది. ఉన్న కొద్దిపాటి నీటిని చంద్ర దండు ఎత్తుకెళ్తే మరుసటి రోజు పంట చేలకు తడి అంద డం లేదని అన్నదాతలు వాపోతున్నారు. బాబు దురా గతా లపై తెలంగాణపై రైతన్నలు మండిపడుతున్నారు.