రాగల 48గంటల్లో భారీ వర్షాలు
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల రాగల 48 గంటల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణ లోని హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, ఖమ్మం మహబూబ్‌నగర్, మెదక్‌జిల్లాల్లో, కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి,కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, రాయలసీమలోని కర్నూలు జిల్లాలో రాగల 48 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.



