*50 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు*

మెట్పల్లి టౌన్ సెప్టెంబర్ 20
(జనం సాక్షి)
మెట్ పల్లి పట్టణ కేంద్రంలో ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 50 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోరుట్ల పట్టణానికికి చెందిన లబ్ధిదారులకు 16లక్షల 85 వేల ఐదువందలు రూపాయలు విలువగల 50 సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు , పేదల పెన్నిధి అని , ఎన్నడు లేని విధంగా , ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఆసుపత్రి పాలైన పేదలకు సీఎం సహాయ నిధి ద్వారా వేల కోట్ల రూపాయలను అందజేస్తున్నారని తెలియజేశారు. మన రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడానికి ప్రతిక్షణం ముఖ్యమంత్రి పరితపిస్తున్నారని కోరుట్ల శాసనసభ్యులు, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఖాదీ బోర్డు చైర్మన్, టిటిడి బోర్డ్ మెంబర్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాణవేణి సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు , టిఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు, అధికారులు, సీఎం సహాయనిధి లబ్ధిదారులు పాల్గొన్నారు