50 సంవత్సరాల కాలంలో ప్రారంభానికి నోచని ఎన్నో పనులను కేవలo ఐదేళ్ళ కాలంలో చేపట్టామని పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ ( జనం సాక్షి ) : తార్నాక డివిజన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఉప సభాపతి శ పద్మారావు గౌడ్ బుధవారం పాల్గొన్నారు. లాలాపేట, లక్ష్మి నగర్, ఇందిరా నగర్, చంద్రబాబు నగర్, , తార్నాక ప్రాంతాల్లో ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి తో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లాలాపేట ప్రాంతంలో 50 సంవత్సరాల కాలంలో ప్రారంభానికి నోచని ఎన్నో పనులను కేవలo ఐదేళ్ళ కాలంలో చేపట్టామని పద్మారావు గౌడ్ తెలిపారు. చంద్ర బాబు నగర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను నిర్మిస్తామని, ప్రభుత్వ పరంగా అనుమతి లభించడంలో జాప్యం జరిగితే తన సొంత నిధులతో రూ. కోటి రూపాయల నిధులను అందించి పనులను ప్రారంభిస్తామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా ప్రకటించారు. అదే విధంగా లాలాపేట ప్రాంతానికి కనీసం 50 మందికి దళిత బంధు స్కీం లో అవకాశాన్ని కల్పిస్తామని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు అందించాలని అధికారులకు ఆదేశించారు. , జలమండలి ద్వారా వివిధ పనులకు నిధులను సమకుర్చామని తెలిపారు. పట్టణ ప్రగతి లో గుర్తించిన సమస్యలను వెన్వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు దశరద్, ఆశలత, డేవిడ్ రాజు, కృష్ణ ప్రసాద్, వెంకటేశ్, గంగాధర్, యమున, రాజేష్ ల తో పాటు తెరాస కార్మిక విభాగం అధ్యక్షులు శ్రీ మోతే శోభన్ రెడ్డి, తెరాస యువనేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.