500 మెగావాట్లు మాత్రమే పవన విద్యుదుత్పత్తి
హైదరాబాద్: పవన విద్యుత్ తయారీ సంస్థ అర్థ వార్షిక ఫలితాల్ని వెల్లడించింది. ప్రస్తుతం 500 మెగావాట్ల పవన విద్యుత్‌ని తాము ఉత్పత్తి చేస్తున్నట్లు మిత్ర సంస్థ ప్రకటించింది.2013 కల్లా 600 మెగావాట్ల ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ రవికైలాష్ ప్రకటించారు. రానున్న ఐదేళ్లలో పవన విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే మన దేశం మూడో స్థానంలో ఉందని వెల్లడించారు. భవిష్యత్తులో ఈ తరహా విద్యుదుత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్థి సాధిస్తుందని రవికైలాశ్ అశాభావం వ్యక్తంచేశారు.