52 కంపెనీలతో ఫేస్‌బుక్‌ సమాచారం

అధికారికంగా ప్రకటించిన ఫేస్‌బుక్‌

న్యూఢిల్లీ,జూలై2(జ‌నం సాక్షి ): ప్రపంచ వ్యాప్తంగా 52 కంపెనీలతో తమ ఖాతాదారుల సమాచారాన్ని పంచుకున్నట్లు ఫేస్‌ బుక్‌ ప్రకటించింది. వాటిలో కొన్ని చైనా కంపెనీలు కూడా ఉన్నట్లు వెల్లడించింది. సెల్‌ ఫోన్‌ కంపెనీలతో ఖాతాదారుల సమాచారం మార్పిడికి ఫేస్‌ బుక్‌ ఒప్పందం కుదుర్చుకుందన్న వార్తల నేపథ్యంలో ఫేస్‌ బుక్‌ వివరణ ఇచ్చింది. ఏయే కంపెనీలతో యూజర్ల సమాచారాన్ని పంచుకున్నారో వెల్లడిస్తూ దాదాపు 700 పేజీల నివేదికను అమెరికన్‌ కాంగ్రెస్‌ కు సమర్పించింది. యాపిల్‌, అమెజాన్‌, బ్లాక్‌ బెర్రీ, శాంసంగ్‌, అలీబాబా, క్వాల్‌ కాం, పాన్‌ టెక్‌తో పాటు అమెరికా భద్రతకు ముప్పుగా భావిస్తున్న చైనా కంపెనీలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. 52 కంపెనీల్లో 38 కంపెనీలతో అగ్రిమెంట్లు ముగిశాయని, జులైలో మిగిలిన వాటి కాలపరిమితి కూడా ముగుస్తుందని ఫేస్‌ బుక్‌ తెలిపింది.

—–