54వ రోజుకు చేరుకున్న నిరసన దీక్షలు…

జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 14 ; మండల పరిధిలోని అరూర్ గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు 54వ నిరసన దీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం, చుట్టుపక్కల గ్రామాల మద్దతుతో అఖిలపక్ష నాయకులంతా కలిసి అరూర్ గ్రామాన్ని నూతన  మండలంగా ఏర్పాటు చేసే వరకు నిరసన దీక్షలు ధర్నాలు,రాస్తారోకోలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, వాకిటి అనంతరెడ్డి,పోలే పాక చేమ్మయ్య,బుర్ర నరసింహ,బండారు మైపాల్ రెడ్డి,కొడితల కన్నయ్య,కసర బోయిన లింగయ్య,జిలకల మల్లేశం,దామర అంజయ్య,బి వెంకటేష్,వి సంతోష్,బి భూపాల్ రెడ్డి,బి బాల్ రెడ్డి,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.