59మంది ప్రాణాలు బలిగొన్న ఉపహార్‌ దుర్గటనకు 15 ఎండ్లు

ఢిల్లీ: 1997 జూన్‌ 13న ఢిల్లీలో ఉపహార్‌ సినిమా హాలులో అగ్ని ప్రమాదం జరిగి నేటికి 15సందత్సరాలు అయింది. ఇందులో 59మంది మరణించారు. బోర్డర్‌ అనే సినిమాకి కిక్కిరిసిన జనం రావడంతో బయటికి వేళ్ళే మార్గాన్ని మూసేసి కుర్చిలు వేసుకుని కూర్చున్నారు అందువలన బయట పడటానాకి వీలులేకపోవడంతో 59మంది అసువులు బాసారు. సినిమా హాలు యజమానులు మాత్రం నెల తిరగకుండ బెయిల్‌ పై బయటికి వచ్చారు. ప్రాణాలు కోల్పోయిన వారికి మాత్రం కనీసం నష్ట పరిహారం కూడా ఇంత వరకు అందక పోవడం దురదృష్టకరం. ఇందులో ఇద్దరు బిడ్డల్నీ పోగోట్టుకున్న నీలం కృష్ణమూర్తి ఉపహార్‌ బాధితుల సంఘానికి అధ్యక్షులుగా వ్యవహారిస్తున్నారు. ఇంకా ఎన్నో కేసులు పెండిగ్‌లో ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.