6నెలల కనిష్టానికి బంగారం ధరలు

అంతర్జాతీయ ఒత్తిళ్లే కారణమని భావన

ముంబై,జూన్‌ 21(జ‌నం సాక్షి): బంగారం ధర మరోమారు భారీగా తగ్గింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు బలపడుతుండడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఏకంగా ఆరు నెలల కనిష్టానికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి ధరలు క్షీణిస్తుండడంతో దేశీయంగా ఆ ప్రభావం పడింది. వెండి, బంగారాన్ని ట్రేడ్‌ చేసే ఎంసీఎక్స్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.131 నష్టపోయి రూ.30,650 వద్ద ట్రేడ్‌ అవుతుండగా, వెండి కిలోకు రూ.136 నష్టపోయి రూ.39,490కి చేరుకుంది. బంగారం దిగుమతుల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్‌లో వరుసగా ఐదో నెలలోనూ దిగుమతులు క్షీణించాయి.