620 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ
కందుకూరు, జూలై 18 : మండల పరిధిలోని కొండమురుసుపాలెం గ్రామంలో మండల పశువైద్యాదికారి డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సిబ్బంది 620 గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందును బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 30 వరకు నట్టలనివారణ మందు పంపిణీ జరుగుతుందని, మేకలు, గొర్రెల పెంపకందారులు మందును తమ గొర్రెలు, మేకలకు అందించాలని ఆయన కోరారు.