లంకతో డూ ఆర్ డైకి భారత్ సిధ్ధం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ,జూలై 8 (జనంసాక్షి):
డూ ఆర్ డై తేల్చుకునేందుకు యువసేన సై అంటోంది. ఆతిథ్య విండీస్‌పై ఘన విజయంతో కాస్త కాన్ఫిడెన్స్ పెరిగింది. కెప్టెన్ ధోనీ జట్టుకు దూరమైనా డ్రెస్సింగ్ రూంలోనే ఉండడంతో ఆటగాళ్లు జోష్‌గానే ఉన్నారు. ఆఖరి మ్యాచ్‌లో లంకపైనా విజృంభించి ఫైనల్లో అడుపెట్టాలని ఆరాటపడుతున్నారు..
పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో యువసేనకు అసలైన పరీక్ష. ఛాంపియన్ ¬దా నిలవాలంటే కరీబియన్ దీవుల్లో ఫైనల్‌కు చేరాల్సిందే. లేదంటే పరువు పోతుంది. ట్రై సిరీస్‌లో యంగ్ ఇండియా మరో అడుగు ముందుకు వేయలంటే ముందున్నది ఒక్కటే మార్గం. అదే లంకపై విక్టరీ సాధించడం… రన్‌రేట్ బోనస్ పాయింట్ల సంగతి పక్కన పెట్టి గెలుపుపైనే యూత్ దృష్టి పెట్టాల్సి ఉంది. అలా జరగకపోతే ఫ్యూచర్‌పై భరోసా తగ్గుతుంది. ముఖ్యంగా జింబాబ్వే టూర్‌కు మరికొందరు సీనియర్లు దూరమవుతున్నారు. ఈ ఫలితం ఆ టూర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి కోహ్లీసేన జాగ్రత్తగా ఆడాల్సి ఉంది…
విండీస్‌పై నెగ్గడంతో కోహ్లీసేనలో ఆత్మవిశ్వాసం ఇంకాస్త పెరిగింది. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ గాడిలో పడ్డారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో చెత్త షాట్లతో వికెట్ పరేసుకున్న టాపార్డర్ బ్యాట్స్‌మెన్ పొరపాట్లను సరిదిద్దుకోగలిగారు. లంకపైనా అదే జోరు కొనసాగించాల్సి ఉంది. ఫాంలో ఉన్న ధానవ్-రోహిత్ మరోసారి శుభారంభం అందిస్తే సరిపోతుంది. కెప్టెన్ కోహ్లీ విండీస్‌పై సూపర్ సెంచరీతో అదుర్స్ అనిపించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్ ఆడాడు. ఇప్పుడు లంకపైనే అతడి దూకుడు కంటిన్యూ అయితే ఫైనల్ బెర్త్ దక్కే ఛాన్స్ ఉంటుంది. బౌలింగ్‌లోనూ యువసేన పటిష్టంగానే ఉంది. లంకపై భువనేశ్వర్‌ను తప్పించడం ఎంత తప్పో కోహ్లీకి తెలిసొచ్చింది. వెంటనే తప్పు సరిదిద్దుకొని విండీస్ మ్యాచ్‌కు భువీని ఆడించాడు. అతడు సక్సెస్ అవ్వడంతో టీమిండియాకు బోనస్ దక్కింది. యువ పేసర్లు భువనేశ్వర్-ఉమేష్ ఇద్దరూ ఫాంలో ఉన్నారు. వీరిద్దరూ మరోసారి అదే ఫాం కంటిన్యూ చేస్తే లంకకు కష్టాలు తప్పవు. ఇషాంత్ శర్మ గాడిలో పడాల్సి ఉంది. టీమిండియా రెండు టార్గెట్‌లతో లంకతో ఫైట్‌కు సిద్ధమవుతోంది. మరోవైపు శ్రీలంకకు కూడా ఇదే చివరి అవకాశం కావడంతో ఆ జట్టును తక్కువ అంచనా వేసేందుకు వీలులేదు. గత మ్యాచ్‌లో భారత్‌ను చిత్తుగా ఓడించడం వారికి అడ్వాంటేజ్‌గా చెప్పొచ్చు. మొత్తం విూద ఇరు జట్లకు కీలకమైన మ్యాచ్ కావడంతో ¬రా¬రీ పోరు తప్పకపోవచ్చు.