ధోనీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో విండీస్ ప్లేయర్స్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ,జూలై 8 (జనంసాక్షి):
గాయంతో ట్రై సిరీస్‌కు దూరమైనప్పటకీ… బౌండరీ అవతల నిలబడి జట్టును ఉత్సాహపరుస్తోన్న భారత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 32వ పుట్టినరోజు వేడుకలు సరదా సరదాగా సాగాయి. ఆదివారం రాత్రి జరిగిన బర్త్‌డే పార్టీలో వెస్టిండీస్ క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. భారత క్రికెటర్లతో కలిసి ధోనీ పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేశారు. ముఖ్యంగా చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న విండీస్ ఆటగాడు బ్రావో ఈ పార్టీలో సందడి చేశాడు. బర్త్‌డే కేకును ధోనీ ముఖంతో పాటు జుట్టుకు పూసి సెలబ్రేట్ చేయడం విశేషం. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోను ధోనీ ట్విట్టర్‌లో ఉంచాడు. ఈ సరదా పార్టీలో ధోనీ ముఖం , జట్టు కేక్‌తో గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి. ఈ సెలబ్రేషన్స్ తనకు ఎంతో ఆనందాన్నిచ్చాయని , విండీస్ ఆటగాళ్ళకు , సహచరులక ధోనీ థ్యాంక్స్ చెప్పాడు. బ్రావో తన ముఖానికి కేక్ పూయడంతో మరింత సాఫ్ట్‌గా ఉందని ధోనీ ట్వీట్ చేశాడు. ఇకపై తాను కేక్ థెరపీ చేయించుకుంటానంటూ చమత్కరించాడు.