చిరకాల ప్రత్యర్థుల అసలైన పోరు
యాషెస్ సిరీస్‌కు సిధ్దమైన ఇంగ్లాండ్-ఆసీస్
లండన్ ,జూలై 9 (ఆర్‌ఎన్‌ఎ):
ప్రపంచ టెస్ట్ క్రికెట్‌లో చిరకాల ప్రత్యర్థుల మధ్య ప్రతిష్టాత్మక పోరుకు రంగం సిధ్ధమైంది. భావోద్వేగాలతో ముడిపడిన యాషెస్ సిరీస్ మొదటి టెస్ట్ బుధవారం నుండి మొదలవనుంది. స్వదేశంలో జరుగుతోన్న సిరీస్‌లో ఆధిపత్యం కనబరచాలని ఇంగ్లాండ్ భావిస్తోంటే… గత ఏడాది సొంతగడ్డపై చేజారిన యాషెస్‌ను ఈ సారి అందుకోవాలని ఆసీస్ పట్టుదలగా ఉంది.
టెస్ట్ క్రికెట్‌లో యాషెస్ సిరీస్‌కు ఉన్న ప్రత్యేకతే వేరు. 130 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ ప్రతిష్టాత్మక సిరీస్ అంటే ఇంగ్లాండ్, ఆస్టేల్రియాలు ¬రా¬రీగా తలపడతాయి. సిరీస్ ప్రారంభానికే ముందే ఇరు జట్ల ఆటగాళ్ళ మధ్య మాటల యుధ్ధాలు, మైదానంలో భావోద్వే గాలు అత్యంత సహజంగా కనిపిస్తూ యుధ్దభూమిని తలపిస్తుంటాయి. 1882లో తొలిసారి ఆసీస్ జట్టు ఇంగ్లాం డ్‌ను వారి సొంతగడ్డపై ఓడించి సిరీస్ గెలుచుకున్నప్పుడు ఇంగ్లీష్ క్రికెట్ చనిపోయిందని బ్రిటీష్ విూడియాలో కథనాలు వచ్చాయి. ఇంగ్లీష్ క్రికెట్ బాడీ ఖననం చేసి ఆ బూడిదను ఆసీస్ తీసుకెళిపోయిందంటూ వ్యాఖ్యానించాయి. అప్పటి నుండీ యాషెస్ సిరీస్ (బూడిద కోసం పోరాటం)గా పేరు వచ్చింది. కేవలం రెండు దేశాల అభిమానులే కాదు ఆటగాళ్ళకూ ఈ సిరీస్ ఎంతో ప్రతిష్టాత్మకం.
అయితే గత రెండు ఎడిషన్లలోనూ ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. 2009లో సొంతగడ్డపైనా , 2010-11లో ఆసీస్ గడ్డపైనా ఇంగ్లాండ్ జట్టు అద్భుతంగా రాణించి యాషెస్ గెలుచుకుంది. దీంతో ఈ సారి హ్యట్రిక్ కొట్టేందుకు ఆ జట్టు సిధ్ధమవుతోంది. ఈ సారి మొత్తం 10 టెస్టులు జరగనుండగా… మొదటి ఐదు మ్యాచ్‌లకూ ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోంది. ప్రస్తుతం బలాబలాల పరంగా చూస్తే ఇంగ్లాండ్‌నే ఫేవరెట్‌గా భావిస్తున్నారు. ¬ం అడ్వాంటేజ్‌తో పాటు నిలకడగా రాణిస్తోన్న ఆటగాళ్ళు వారి సొంతం. బ్యాటింగ్‌లో అలెస్టర్ కుక్ , ఇయాన్ బెల్ , జొనాథాన్ ట్రాట్‌తో పాటు కెవిన్ పీటర్సన్ ఇంగ్లీష్ టీమ్ ప్రధాన బలం. బౌలింగ్‌లో బ్రాడ్, ఆండర్సన్, స్వాన్ కీలకంగా చెప్పొచ్చు. సొంతగడ్డపై వీరు తమ స్వింగ్ బౌలింగ్‌తో రెచ్చిపోయే అవకాశాలున్నాయి. మరోవైపు సీనియర్ ఆటగాళ్ళు రికీ పాంటింగ్, మైకేల్ హస్సీ రిటైర్మెంట్లతో బలహీనపడిన ఆస్టేల్రియాకు ఈ సిరీస్ సవాల్‌గానే చెప్పాలి. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో ఆ జట్టు బ్యాట్స్‌మెన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.
అయితే టెస్టుల్లో పరిస్థితి వేరుగా ఉండొచ్చు. ఆసీస్ బ్యాటింగ్‌లో షేన్ వాట్సన్, మైకేల్ క్లార్క్ , హడ్డిన్ లాంటి ప్లేయర్లు… బౌలింగ్‌లో పాటిన్‌సన్, పీటర్ సిడెల్ కీలకంగా భావిస్తున్నారు. తన పునర్వైభవాన్ని తిరిగి అందుకోవాలనుకుంటోన్న కంగారూలకు యాషెస్ సిరీస్ మంచి అవకాశంగా చెప్పొచ్చు. మొత్తం విూద రెండు నెలల పాటు ఆసీస్-ఇంగ్లాండ్ అభిమానులు టెస్ట్ క్రికెట్ మజాను ఆస్వాదించనున్నారు.