క్షమాపణలు చెప్పిన జడేజా,రైనా

 


ముంబై ,జూలై 9 (ఆర్‌ఎన్‌ఎ):

విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో గొడవపడిన భారత ఆటగాళ్ళు సురేష్‌ రైనా , రవీంద్ర జడేజా క్షమాపణలు చెప్పారు. ఈ గొడవపై స్పందించిన బోర్డు వారిని వివరణ కోరగా… టీమ్‌ మేనేజర్‌ ఎంవీ శ్రీధర్‌తో రైనా , జడేజా ఇద్దరూ మాట్లాడారు. జరిగిన సంఘటనకు అపాలజీ చెప్పడంతో పాటు మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా హాకీ ఇచ్చారు. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు మైదానంలో హుందాగా ఉండడంపై వారికి అవగహాన ఉందని, కేవలం సహనం కోల్పోయి మాత్రమే ఇది జరిగిందని చెప్పినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. దీనిపై ఇద్దరూ మాట్లాడుకోవడంతో పాటు జట్టుకు , బోర్డుకు క్షమాపణలు చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై మేనేజర్‌ రిపోర్ట్‌ పరిశీలిస్తామని సోమవారం బీసిసిఐ ప్రెసిడెంట్‌ దాల్మియా చెప్పారు. అయితే తాజాగా ఇద్దరూ అపాలజీ చెప్పడంతో వారిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు. శుక్రవారం వెస్టిండీస్‌తో మ్యాచ్‌ జరిగినప్పుడు జడేజా బౌలింగ్‌లో రైనా రెండు క్యాచ్‌లు వదిలేయడం వీరి గొడవకు కారణమైంది. సహనం కోల్పోయిన జడేజా రైనా వాగ్వాదానికి దిగడంతో కెప్టెన్‌ కోహ్లీ సర్దిచెప్పినప్పటకీ ఫలితం లేకపోయింది.