శ్రీలంక-భారత్‌ల మ్యాచ్‌కు వరుణుడి అడ్డంకి
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇక్కడ భారత-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు ఆటకం కల్గించాడు. ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్ 29.0 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 119 పరుగుల వద్ద ఉండగా వర్షం కురవడంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. తుది పోరుకు చేరుకోవాలంటే భారత జట్టు చావో రేవో తేల్చెకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే కోహ్లి సేన జపైనల్ చేరే అవకాశాలు ఉంటాయి.వరుసగా రెండు ఓటములు ఇబ్బందికర పరిస్థితుల్లో పడిన భారత్… వెస్టిండీస్‌తో జరిగిన తమ చివరి మ్యాచ్‌లో దుమ్ము రేపి ట్రాక్‌లోకి వచ్చింది.