ట్రై సిరీస్‌ ఫైనల్లో భారత్‌

   

పోర్ట్‌ఆఫ్‌స్పెయిన్‌,జూలై 10 (జనంసాక్షి):

కరేబియన్‌ గడ్డపై జరుగుతోన్న ముక్కోణపు సిరీస్‌లో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్ళింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంకపై 81 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. వరుణుడు అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించారు. భారత్‌ ఇన్నింగ్స్‌ 3 వికెట్లకు 119 పరుగుల దగ్గర నిలిచిపోయిన తర్వాత దాదాపు నాలుగున్నర గంటల పాటు వర్షంతో ఆట తుడిచిపెట్టుకుపోయింది. దీంతో భారత ఇన్నింగ్స్‌కు బ్రేక్‌ ఇచ్చిన అంపైర్లు డక్‌వర్త్‌ లూయీస్‌ విధానం ప్రకారం శ్రీలంక లక్ష్యాన్ని 26 ఓవర్లలో 178 పరుగులుగా నిర్ణయించారు. లక్ష్య ఛేదనలో లంక బ్యాట్స్‌మెన్‌ను భారత యువపేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ బెంబేలెత్తించాడు. అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొట్టిన భువనేశ్వర్‌ లంక టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. దీంతో ఆ జట్టు కేవసం 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. లంక ఇన్నింగ్స్‌లో చందిమాల్‌ 26 పరుగులు తప్పిస్తే… మిగిలిన వారంతా పూర్తిగా విఫలమయ్యారు. ఏ దశలోనూ విజయం దిశగా లంక ఇన్నింగ్స్‌ సాగలేదు. భవనేశ్వర్‌కు తోడుగా ఇశాంత్‌ శర్మ , జడేజా కూడా రాణించడంతో లంక కథ 96 పరుగులకే ముగిసింది. శ్రీలంక జట్టులో కేవలం నలుగురు మాత్రమే రెండంకెల స్కోర్‌ సాధించారు. ఆరు ఓవర్లలో 8 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డ్‌ లభించింది. లంకను 100 పరుగుల లోపే ఆలౌట్‌ చేయడంతో భారత్‌కు బోనస్‌ పాయింట్‌ దక్కింది. దీంతో 10 పాయింట్లతో టీమిండియా ఫైనల్‌కు చేరుకోగా… 9 పాయింట్లతో విండీస్‌తో సమానంగా ఉన్న లంక మెరుగైన రన్‌రేట్‌ ఆధారంగా ముందంజ