అదరగొట్టిన అఫ్రిది
తొలి వన్డేలో పాక్ విజయం
గయానా ,జూలై 15 :
వెస్టిండీస్ పర్యటనను పాకిస్థాన్ విజయంతో ఆరంభించింది. గయానా వేదికగా జరిగిన తొలి వన్డేలో 126 పరుగుల తేడాతో విక్టరీ కొట్టిం ది. బ్యాటింగ్‌లో పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న పాక్ అఫ్రిది మెరుపులతో కోలుకుని 224 పరుగులు చేయడం ఒక విశేష మైతే… బంతితోనూ రాణించిన అఫ్రిది ఏడు వికెట్లతో విండీ స్‌ను కుప్పకూల్చాడు. టాస్ గెలిచిన విండీస్ తడిసిన పిచ్ స ీమర్లకు అనుకూలిస్తుందని భావించి ఫీల్డింగ్ ఎంచుకుంది. దానికి తగ్గట్టే ఆరంభంలోనే పాక్ టాపార్డర్‌ను విండీస్ పేసర్లు బెంబేలెత్తించారు. దీంతో ఆ జట్టు కేవలం 23 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఉమర్ అక్మల్ కూడా త్వరగానే వెనుదిరగడంతో పాక్ ఇన్నింగ్స్ త్వరగానే ముగుస్తుందనిపించింది. అయితే కెప్టెన్ మిస్బాబుల్ హక్ సహకారంతో అఫ్రిది జట్టును ఆదుకు న్నాడు. తనదైన మెరుపు బ్యాటింగ్‌తో స్కోర్ 150 దాటించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నారు. అటు నిలకడగా ఆడుతూ సపోర్ట్ ఇచ్చిన మిస్బా కూడా హాఫ్ సెంచరీ సాధించగా… వీరిద్దరూ ఆరోవికెట్‌కు 110 పరుగులు జోడించారు. అఫ్రిది 55 బంతుల్లో 6 ఫోర్లు , 5 సిక్సర్లతో 77 పరుగులకు ఔటవ గా…మిస్బా , టెయిలెండర్లతో కలిసి స్కోర్ 200 దాటించాడు. చివరికి పాకిస్థాన్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 224 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో ¬ల్డర్ 4 , రోచ్ 2 , బ్రేవో 2 వికెట్లు పడగొట్టారు. 225 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ తమ వైఫల్యాన్ని కొనసాగించారు. గేల్ రనౌట్‌తో మొద లైన విండీస్ పతనం క్రమం తప్పకుం డా సాగింది. ముఖ్యంగా షాహిద్ అఫ్రిది స్పిన్ మ్యాజిక్‌కు కరేబియన్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. శామ్యూల్స్ 25 , సామి 21 నాటౌట్ తప్పిస్తే…. మిగిలిన వారంతో ఘోరంగా విఫలమయ్యారు. ఆ జట్టు లో ఏడుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే వెను దిరగడం విశేషం. అద్భుతంగా బౌలింగ్ చేసిన అఫ్రిది 9 ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ వన్డే క్రికెట్‌లో ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శన. తన కెరీర్ ముగిసిపోయిందంటూ వచ్చిన విమర్శలకు అఫ్రిది ఆటతోనే సమాధానమిచ్చాడు. బ్యాటింగ్‌లో 77 పరుగులతో పాటు బంతితోనూ అదరగొట్టి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించిన అఫ్రిదికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో పాక్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.