ధోనీ దోరకడం లక్‌ : లక్ష్మణ్‌

కోల్‌కతా జూలై 15 (జనంసాక్షి):

భారత జట్టుకు మహీంద్ర సింగ్‌ ధోనీ లాంటి సారధి దొరకడం అదృష్టమని మాజీ టెస్టు క్రికెటర్‌ వివిఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. ప్రపంచ కప్‌ టైటిల్స్‌ గెలిచిన అతని రికార్డులే ధోని అంటే ఏమిటో  చెబుతాయన్నాడు. కఠిన సమయాల్లో అతను తగు విధంగా స్పందిస్తాడని అది అతని గొప్పతన్నాడు. ఉద్వేగానికి లోనుకాడని, అతని లాంటి సారథి దొరకడం అదృష్టమని కొనియాడాడు. రవీంద్ర జడేజాను ప్రోత్సహించడం వల్ల మంచి బౌలర్‌ దొరికాడని, మెరుపు ఫీల్డర్‌ అని, ఉపయుక్తమైన బ్యాట్స్‌మెన్‌ కూడా అని అన్నాడు. దక్షిణాఫ్రికా సిరస్‌లో భారత్‌ రాణిస్తుందన్నాడు. గత రెండు మ్కాచుల్లో సెంచరీతో సత్తా చాటిన మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ కూడా రాణిస్తాడని అశిస్తున్నట్లు తెలిపాడు.