హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో


మాజీ నెంబర్‌వన్‌ హింగిస్‌కు చోటు
స్విట్జర్లాండ్‌ జూలై 15 :

మహిళా టెన్నిస్‌ మాజీ నెంబర్‌వన్‌ మా ర్టినా హింగిస్‌కు అరుదైన గుర్తింపు లబించింది. అంతర్జాతీయ టెన్నిస్‌లో అత్యున్నత గౌరవంగా భావించే హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ఈ స్విట్జర్లాండ్‌ స్టార్‌కు స్థానం లభించింది. హింగిస్‌తో పాటు థెల్మా కోన్‌ లాంగ్‌(ఆస్ట్రేలియా), క్లిఫ్‌ డ్రైస్‌డేల్‌ (దక్షిణాఫ్రికా), చార్టీ పాసరెల్‌( అమెరికా)లు కూడా ఎంపికయ్యారు. సింగిల్స్‌తో పాటు డబుల్స్‌ విభాగంలోనూ ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన హింగిస్‌ కెరీర్‌లో రెండువిబాగాల్లో కలిపి 14 గ్రాండ్‌శ్లామ్‌ టైటిల్స్‌ సాధించింది. ఈ ఘనతత నాకు ఎంతో సంతోషంగా ఉంది. చిన్నారిగా ఉన్నపుడు హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌: లాంటిది ఉందని నాకుతెలీదు. క్రీడాకారిణిగా ఉన్నపుడు టెన్నిస్‌ తప్ప మరో అంశం ఆలోచించలేదు. ఈ గౌరవానికి నేను అర్హురాలినో కాదో నాకు తేలీదు, ఈ గుర్తింపు ఇచ్చిన వారందరికి దన్యవాదాలు అని 2007లో టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన 32 ఏళ్ల హింగిస్‌ వ్యాఖ్యానించింది.