పాంటింగ్‌ విశ్లేషన సరైనదేనా..?


న్యూఢిల్లీ,జులై22(జనంసాక్షి) :

ఇటీవల ఆస్టేల్రియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్‌ మన్‌ ఎవరన్న దానిపై చర్చమొదల య్యింది. లారానే గొప్పంటూ పాం టింగ్‌ వ్యాఖ్యలు చేసినా ఇద్దరూఅ త్యుత్తమ బ్యాట్స్‌మెన్గానే గుర్తించాలి. ఎవరికి వారు రికార్డులు సాధించి నవారే. బ్యాటింగ్‌లో ఇద్దరిదీ విభిన్న మైన స్టైల్‌. తన దృష్టిలో లారా అత్యు త్తమ బ్యాట్స్‌మెన్‌ రికార్డుల కోసం లారా ఎప్పుడూ ప్రయత్నించలేదని పాంటింగ్‌ అన్నాడు.  అభిప్రాయాలు వారికు న్నా.. పాంటింగ్‌ మాత్రం ‘లా రానే గొప్ప’ అంటూ చర్చకు తెరతీ శాడు. భారత్‌ క్రికెట్‌ లో అత్యుత్తమ క్రికె టర్లు ఎందరో ఉన్నారు. గవాస్కర్‌, శ్రీకాంత్‌, కపిల్‌దేవ్‌ ఇలా ఎందరో లెజండ్స్‌ పుట్టుకుఒచ్చారు.  టెండూ ల్కర్‌, ధోనీ, విరాట్‌ కోహ్లి ,శిఖర్‌ ధావన్‌ వంటి వారు ఇప్పుడుమైదానాన్ని ఏలుతున్నారు.  వీరిలో ఎవరి  స్టైల్‌ వారిదే.  ఇందులో టెండూల్కర్‌ స్టార్‌బ్యాట్స్‌మెన్‌గా  ప్రత్యేకతను పొం దాడు. టెండూల్కర్‌ సాధించిన రికార్డులు మరెవ్వరూ సాధించి ఉండరు. అతడి రికార్డులను   రాజ్యసభ సభ్యుడిగా నియమించి గౌరివించింది. అత్యు త్తమ క్రీడాకారుడిగా ఎదిగిన సచిన్‌ టెండూల్కర  విషయంలో రికీ పాం టింగ్‌కు మాత్రం అంచనాలు వేరుగా ఉన్‌ఆనయి.  లారానే గొప్పంటూ ఎందుకు వివాదానికి తెరలేపాడు..?అన్నది మాత్రంఅంతు చిక్కని ప్రశ్నగానే ఉంది. బ్యాట్స్‌మన్‌ సత్తాకు అద్దం పట్టేవి అతడు సాధించిన  రికార్డులే! అందుకే ఓ బ్యాట్స్‌మన్‌ ప్రతిభపై వాటి ఆధారంగానే ఓ నిర్ధారణకొస్తారు. ఆ ప్రకారంగా చూస్తే.. సచిన్‌, లారాలు ఎవరికివారు లెక్కలేనన్ని రికార్డులు నెలకొల్పారు. మన మాస్టర్‌ 198 అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 15,837 అత్య ధిక పరుగులు సాధించాడు.  అత్యధికంగా 51  సెంచరీలు సాధించాడు. ఇలా సచిన్‌కు టెస్టుల్లో ఎన్నో రికార్డులు దాసోహ మయ్యాయి. అత్యధిక టెస్ట్‌ సెంచరీలు సాధించిన హీరోగా చరిత్రలో నిలిచాడు. అతడు గ్రౌండ్‌లో ఉంటే చాలనుకుని ప్రేక్షకులు కరతాళ ధ్వను లు కొట్టేవారు. లారా 2006లోనే రిటైరై తే, సచిన్‌ ఇప్పటికీ కెరీర్‌ను కొనసాగిస్తు న్నాడు. అంతేకాదు.. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్‌ కెరీర్‌ 1989 సంవత్సరం లో  మొదలుపెట్టాక ఏడాదికి గానీ లారా 1990లో కెరీర్‌ మొదలుకాలేదు. క్రీజులో సుదీర్ఘంగా కొనసాగడంలో లా రా దిట్ట. ఇందుకు అతను సాధించిన డబుల్‌, ట్రిపుల్‌, క్వాడ్రఫుల్‌ సెంచరీలే గీటురాయి. సచి న్‌తో పోలిస్తే లారా గొప్పతనాన్ని రికీ పాంటింగ్‌ ఇక్కడే విశ్లేషించే ప్రయ త్నం చేశాడు. అంతు లేని సహనంతో బ్యాటింగ్‌ చేయడమే కాదు.. వేగంగా పరుగులు సాధించడ మూ లారాకు మాత్రమే సాధ్యమైన విద్య. లారాతో పోలిస్తే సచిన్‌ మ్యాచ్‌ విన్నర్‌ కాదని పాంటింగ్‌ అన్నాడు. పాంటింగే కాదు.. చాలా మందీ ఇదే అభిప్రాయంతో ఉన్నారు.  1998-99లో బ్రడ్జ్‌స్టోన్‌లో ఆస్టేల్రియాతో జరిగిన టెస్ట్‌మ్యాచ్‌లోలారా 153 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ చేయడమే గాకుండా వెస్టిండీస్‌ జట్టుకు అద్భుతమైన విజయం సాధించి పెట్టాడు. లారా 32 టెస్టుల్లో విజయం సాధించడం ద్వారా సరాసరి 61.02 సాధించాడు. అదే సచిన్‌ 70 టెస్ట్‌ విజయాల్లో 62.36 సరాసరిని సాధించాడు. అయినా కూడా మ్యాచ్‌ విన్నర్‌గా ఇద్దరిలో వెంట్రుకవాసి తేడా ఉందని అనిపిస్తే అది లారా మరింత దూకుడుగా బ్యాటింగ్‌ చేయడమే కావొచ్చు. కీలక మ్యాచుల్లో విఫలమవుతాడనే విమర్శను లారాతో పోలిస్తే, సచినే ఎక్కువగా ఎదుర్కొన్నాడు. సచిన్‌ వంద సెంచరీలు చేసినా, వన్డేల్లో అతను సెంచరీల అర్ధ సెంచరీకి ఒకటి తక్కువ చేశాడే?అని అసంతృప్తి పడే అభిమానులున్నారు. సచిన్‌కన్నా లారానే బెస్ట్‌ అన్న పాంటింగ్‌ అభిప్రాయం ఎలా ఉన్నా క్రికెట్‌లో ఇద్దరూ దిగ్గజాలే. ఆస్టేల్రియా లెజెండ్‌ రికీ పాంటింగ్‌ అభిప్రాయం ఏదైనా ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండడం సహజం. సచిన్‌,లారా ఎన్ని రికార్డులు సాధించాడన్న దానికన్నా ఆస్టేల్రియా జట్టుకు కెప్టెన్‌గా ఇండియాను ఎదుర్కోవడంపైనే పాంటింగ్‌ ఈ విశ్లేషణ చేసి ఉంటాడు.