క్రికెట్ కెరీర్‌కు షేన్‌వార్న్ గుడ్‌బై
సిడ్నీ ,జూలై 22 (జనంసాక్షి) : ఆస్టేల్రియా స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్ తన క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆట నుండి పూర్తిగా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గతంలోనే రిటైర్మెంట్ ప్రకటించిన వార్న్ ప్రస్తుతం బిగ్‌బాష్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. అయితే వచ్చే సీజన్ నుండి దానికి కూడా రిటైర్మెంట్ ఇస్తున్నట్టు వెల్లడించాడు. బిగ్‌బాష్‌లో వార్న్ మెల్‌బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 43 ఏళ్ళ ఈ ఆసీస్ లెజెండ్ ఇటీవలే ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నాడు. బిగ్‌బాష్‌తో పాటు ఆట నుండి పూర్తిగా వీడ్కోలు తీసుకునేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్టు వార్న్ తెలిపాడు. తన కుటుంబంతో పాటు వ్యాపారాలకే పరిమితం కానున్నట్టు చెప్పాడు. అయితే కామెంటేటర్‌గా కొనసాగే అవకాశం కూడా ఉందన్నాడు. తనకు మధ్ధతుగా నిలిచిన బిగ్‌బాష్ మెల్‌బోర్న్ జట్టుకు వార్న్ కృతజ్ఞతలు తెలియజేశాడు. దాదాపు రెండు దశాబ్ధాల అంతర్జాతీయ కెరీర్‌లో వార్న్ 145 టెస్టుల్లో 708 వికెట్లు పడగొట్టాడు. తద్వారా 700 క్లబ్‌లో చేరిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. అలాగే 194 వన్డేల్లో 293 వికెట్లు తీసుకున్నాడు.