సిఎస్‌ఎ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన లోర్గాత్‌

జోహెనస్‌బర్గ్‌ ,జూలై 22 (జనంసాక్షి) : ఐసిసి మాజీ సిఈవొ హరూన్‌ లోర్హాత్‌ దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. గత కొంత కాలంగా బోనస్‌ స్కాండిల్‌తో పరువు కోల్పోయి గాడి తప్పిన సఫారీ బోర్డును సరిదిద్దాలని భావిస్తున్నాడు. అయితే సిఎస్‌ఎ చీఫ్‌గా లోర్గాత్‌ పదవీ బాధ్యతలు తీసుకోవడంపై భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై స్పందించిన లోర్గాత్‌ బీసిసిఐతో తన సంబంధాలు సరిగా లేకపోవడంపై విచారం వ్యక్తం చేశాడు. ఐసిసి నుండి తాను తప్పుకున్న తర్వాత బీసిసిఐతో సంబంధాలు ఈ స్థాయిలో దెబ్బతింటాయని ఊహించలేదన్నాడు. పరిస్థితి చక్కబడుతుందన్న ధీమా వ్యక్తం చేశాడు. క్రికెట్‌ సౌతాఫ్రికాను గాడిలో పెట్టడమే తన ముందున్న ప్రధాన లక్ష్యంగా లోర్గాత్‌ అభివర్ణించాడు