పరిస్థితి


ఆరోజు మంగళవారం, మూడు కావస్తోంది. అసలే ఎండాకాలం. సూర్యుడు కసితారా మండుతున్నాడు. రెండు ఆర్టీసీ బస్సులు టాంక్‌బండ్‌ పైన ఉన్న శ్రీశ్రీ విగ్రహం దగ్గర రోడ్డు పక్కన ఆగాయి. వెనుక బస్సు నుంచ బిలబిల మంటూ పోలీసులు, వారి వెంట అధికారులు దిగారున.. ముందున్న బస్సులోంచి ఎవరూ దిగలేదు. మొబైల్‌ కోర్టు బస్సు అది. ఆ బస్సు ఆర్టీసి బస్సులాగే ఉన్నప్పటికీ కాస్త భిన్నంగా ఉంది.

డ్రైవరు సీటు వెనుక ముగ్గురు కూర్చునే ఓ సీటుంది. డ్రైవరు పక్కన కూడా ముగ్గురు కూర్చునే సీటుంది. ‘డ్రైవర్‌ వెనుక సీట్లో ‘మేజిస్ట్రేట్‌’ కూర్చున్నారు. డ్రైవర్‌ పక్కన ఉన్న సీట్లో ముగ్గురు ఉద్యోగులు కూర్చున్నారు. వాళ్లు తమ రికార్డులు తీసి సర్ధుకొంటున్నారు. మేజిస్ట్రేట్‌ వెనుక సీట్లో అటెండర్‌ సీటుంది. బస్సు ఆగగానే అతను బబస్సు దిగి డోర్‌ పక్కన నిల్చున్నాడు. బస్సు వెనుకవైపున బస్సువైపు ముఖం చేస్తూ ఓ కుర్చీ. దాని ముందు చిన్న టేబుల్‌. వాటికి రెండువైపులా రెండు కుర్చీలు బెంచీ క్లర్క్‌లు కూర్చోవడానికి. ఆ కుర్చీల పక్కన రెండు బోన్లు, మేసిస్ట్రేట్‌ కుర్చీ వెనుక బస్సు చివరన చిన్న స్టూలు. జరిమానాలు కట్టడానికి కౌంటర్‌. కోర్టు వాతావరణం ఉంది. కోర్టు కనిపంచకుండా కిటికీలకు పరదాలు.

వేడికి తల మాఉతుంది. అదోరకంగా ఉంది మేజిస్ట్రేట్‌కకి. ఆ కోర్టులో జాయినై వారం రోజులవుతుంది. ఆ వాతావరణం కొత్తగా ఉంది. నిజానికి నచ్చలేదు. తను చదువుకున్న దేమిటి? చేస్తున్న ఉద్యోగమేమిటి? మామూలు కోర్టులకి ఈ కోర్టుకి ఎంత భేదం? అడ్వకేట్లు ఉండరు. వాదనలు ఉండవు. సాక్షుల విచారణ ఉండదు. ఏమీ ఉండదు. ఒకే ఒక ప్రశ్న ఉంటుంది. ‘నేరం చేశావా’ తల ఊపడం తప్ప వేరే సమాధానం ఉండదు. తోచిన జరిమానా విధించడం. వెంత దరిద్రంగా ఉంది పరిస్థితి. కేసుల గురించి రోడ్డు మీదికి రావడం.

బ్రెయిన్‌తో పనిలేకుండా యాంత్రికంగా జరిమానాలు వేయడం. ఏం సాధిస్తారో. ఈ కోర్టుతో ఎంత శ్రమ, ఎంత ఖర్చు. రెండు బస్సులు నిద్రించడం. ఇద్దరు డ్రైవర్లు, ఆరుగురు కానిస్టేబుళ్లు . ఆరుగురు టిటిఐలు, ఒక ఎస్సై, ఓ మేజిస్ట్రేట్‌, కోర్టు స్టాఫ్‌, సరైన వ్యాపకమూ లేకుండా కాలక్షేపం చేయడం. ఈ కోర్టేం సాధిస్తుందో? యాంత్రికంగా జరిమానాలు వేయడానికి మేజిస్ట్రేట్‌ కావాలా? ఓ టిటిఐనో గుమాస్తానో సరిపోదా అనుకున్నాడు మేజిస్ట్రేట్‌. తన వెంట తెచ్చుకొన్న హిందూ, తెలుగు పేపరు నమిలేశాడు. ఈ ఉద్యోగమే ఓ శిక్ష అనుకొంటే సరైన వ్యాపకంలేని ఈ మొబైల్‌ కోర్టు ఉద్యోగం కఠిన శిక్షలా అనిపించింది.

రోడ్డు మీద వెళ్తున్న బస్సులని ఆపి టికెట్లు చెకింగ్‌ చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు పోలీసుల సహాయంతో ఫుట్‌బోర్డు మీద నిల్చున్న ప్రయాణీకులని లాగి కేసులు బుక్‌ చేస్తున్నాడు. అర్జంటు పనుల మీద వెళ్ళాల్సిన వాళ్లు గొడవ పడ్తున్నారు. బస్సుల్ని ఆపుతూనే ఉఆన్నరు. కేసుల సంఖ్య మెల్లమెల్లగా పెరుగుతుంది.

రోడ్డు మీద చిన్న జాతరలాగా ఉంది. తల ఊపడం తప్ప ఏమీ సమాదానం చెప్ప కూడదని వార్నింగులు ఇస్తున్నారు. జవాబు చెబితే జరిమానా మొత్తం పెరిగిపోతుందని భయపెడ్డున్నారు.

పది చలానులు రెడీ కాగానే వాటిని తీసుకొనివచ్చి క్లర్క్‌లకి ఇచ్చాడు కానిస్టేబుల్‌. వాటిని రాసుకోవడం మొదలు పెట్టారు. వాళ్లు వచ్చి బెంచి క్లర్క్‌లు ఉండే స్థానాల్లో కూర్చున్నారు. మేజిస్ట్రేట్‌ కూడా వచ్చి తన కుర్చీలో కూర్చున్నాడు. అటెండర్‌ తలుపు ముందు నిల్చుని పోలీసులు తెచ్చిస్తున్న చలానుల్ని క్లర్కులకి అందజేస్తున్నాడు. పది కేసులు రాయడం పూర్తయిన తరువాత కేసులు పిలవడం మొదలుపెట్టారు.

ఒక వ్యక్తి వచ్చి బోనులో నిల్చున్నాడు.

”ఫుట్‌బోర్డు పైన నిల్చొని ప్రయాణం చేసావా?” మేజిస్ట్రేట్‌ ప్రశ్న.

తల ఊపడం మినహా జవాబు లేదు.

‘యాభై రూపాయలు జరిమానా లేదా వారంరోజులు జెయిలు’

కాగితాల మీద రాస్తూ చెప్పాడు మేజిస్ట్రేట్‌. అతన్ని పోలీసులు తీసుకొనిపొయ్యారు. ఆ చలానుని వెనుక ఉన్న క్లర్క్‌కిచ్చాడు అటెండర్‌.

ఆ తర్వాత ఇంకొకరొచ్చారు.

”టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేసారా ?”

తల ఊపడం తప్ప జవాబు లేదు.

”వంద రూపాయలు జరిమానా లేదా పదిరోజులు జెయిలు”

మళ్లీ ఇంకొకరు

”ఆడవాళ్ల సీట్లో కూర్చున్నావా ?”

దీనికి తలూపడమే సమాధానమైంది.

”యాభై రూపాయలు జరిమానా లేదా వారం రోజులు జైలు”

ఇంకొకరు

”ఫుట్‌బోర్డు పై టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేస్తున్నావని నేరం మోపారు. నిజమేనా?”

తల ఊపడమే సమాధానమైంది.

”నూటాయాభై జరిమానా, కట్టని పక్షంలో పదిరోజులు జెయిలు” చెబుతూ రాశాడు.

అలా రొటీన్‌గా చెబుతూ పోతూనే ఉన్నాడు మేజిస్ట్రేట్‌, చలాన్లు అటెండరు దగ్గరికి, అక్కడ్నించి మేజిస్ట్రేట్‌కి, ఆ తర్వాత అటెండర్‌కి అ్కడ్నించి జరిమానా వసూలు చేసే క్లర్క్‌ దగ్గరికి వెళ్తూనే ఉన్నాయి.

నలభై కేసులు వచ్చినట్టున్నాయి. బస్సులో చిన్న ఫ్యాను గిర్రున తిరుగుతున్నప్పటికి ఆ ఎండలో ఆ కోటులో ఆ బస్సులో కూర్చొవడం నిజంగా నరకంలాగే ఉంది. అందులో ఈ జరిమానాలు విధిస్తూ కూర్చోవడం. హుస్సేన్‌సాగర్‌ అప్పుడప్పుడూ తన కాలుష్యాన్ని వీస్తూనే ఉంది. బుద్దుడు మూనంగా భరిస్తూనే ఉన్నాడు. మేజిస్ట్రేట్‌ కర్చీఫ్‌ తీసుకొని ముఖాన్ని తుడుచుకొన్నాడు. బయట సందడి కాస్త తగ్గింది. కొంతమంది జరిమానాలు కడ్తున్నారు. కొంతమంది కట్టనట్టున్నారు. రసీదుల మీద సంతకాలు చేస్తూనే ఉన్నారు.

నాలుగున్నర దాటింది. విసుగ్గా ఉంది మేజిస్ట్రేట్‌కి. ఎప్పుడు ఇంటికి వెళ్లిపోదామా అన్పిస్తుంది. ఆ వాతావరణంలో ఎవరికైనా అట్లాగే అన్పిస్తుంది. కొత్త కేసులు తీసుకురావద్దని అటెండర్‌తో చెప్పి పంపించాడు.

”అందరు జరిమానాలు కట్టారా” అడిగాడు క్లర్క్‌ని.

”నలుగురైదుగురు కట్టాలి సార్‌” జవాబిచ్చాడు.

జరిమానా కట్టని వాళ్ల చలాన్లు తీసుకొని జైలు వారెంట్లు తెచ్చారు. వాటి మీద సంతకాలు చేశాడు. మిగిలిన ఇద్దరి జరిమానా మొత్తానికి కూడా రసీదులు రాయించి సంతకం చేశాడు.

”నాకు పనుంది. నేను వెళ్లిపోతాను. ఆ ఇద్దరూ డబ్బు కడితే రసీదులివ్వండి. లేనట్లయితే వారెంట్లు ఇచ్చి పంపండి. అరగంటసేపు వెయిట్‌  చేయండి” స్టాఫ్‌కి సంతకం చేశాడు.

”నాకు పనుంది. నేను వెళ్లిపోతాను. ఆ ఇద్దరూ డబ్బు కడితే రసీదులివ్వండి.య లేనట్టయితే వారెంట్లు ఇచ్చి పంపండి. అరగంటసేపు వెయిట్‌ చేయండి” స్టాఫ్‌కి చెప్పాడు మేజిస్ట్రేట్‌.

స్టాఫ్‌ ఈ బస్సు నుంచి మరో బస్సుకి మారారు. మొబైల్‌ కోర్టుతో బాటు మేజిస్ట్రేట్‌ వెళ్ళిపోయాడు.

బాబూ – నువ్వు ఎక్కడున్నా తిరిగి రావాలి. ఎంసెట్‌ చదవకపోయినా ఫరవాలేదు. మూడు రోజులుగా నీ గురించి తెలిసిన స్ఠలాల్లో అంతటా వెదికాం. నీ గురించి వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాం.

అమ్మా, నాన్నా

తనిచ్చిన ప్రకటనని అప్పటికి నాలుగుసార్లు చదివాడు ఆనందరావు. అడ్రసిచ్చాడు. ఫోన్‌ నెంబరిచ్చాడు. ఆచూకీ తెలిసిన వాళ్లకి బహుమతి ఇస్తానని రాసాడు. కొడుకు కన్పించడం లేదని తెలిసినప్పటి నుంచి అతని మయనసు మనసులో లేదు. ఒక్కగా నొక్క కొడుకు. ఎంసెట్‌కి ప్రిపేర్‌ కావడానికి హైదరాబాద్‌ వెళ్ళాడు. పరీక్ష రెండు రోజులుందనగా కన్పించినాడంటే మళ్ళీ కన్పించలేదు. కోచింగ్‌కి వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదు. ఆరోజు తెల్లవారి అతని చెల్లెలు రమ ఈ విషయం ఫోన్‌ చేసి చెప్పింది. ఆనందరావు పరుగున హైదరాబాద్‌ వెళ్ళాడు. స్నేహితుల్ని బంధువుల్ని విచారిం చాడు. పోలీసులకి రిపోర్ట్‌ ఇచ్చాడు. ఫలితం లేకపోయింది. చివర కు ఈ ప్రకటన ఇచ్చాడు.

కొడుకు అలా ఎందుకు చేశాడో అర్ధం కాలేదు. ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులొచ్చాయి. డాక్టరవుతాడనుకొన్న కొడుకు అలా ఎందుకు అంతర్థానమయ్యాడో అర్థం కాలేదు. మనసంతా ఖాళీగా  ఉంది. ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కాలేదు. భార్య లోపల ఏడుస్తుంది. చెల్లీ, తల్లి ఆమెను ఓదార్చుతున్నారు. కొడుకు వస్తాడ న్న ఆశ ఆనందరావుకి ఏ మూలో ఉంది.

పదకొండు కావొస్తుంది. పోస్ట్‌మెన్‌ రామయ్య తమ ఇంటి ముందు కన్పించగానే ఆనందరావుకి పట్టరాని ఆనందం వేసింది. పరుగున వెళ్ళి రామయ్య దగ్గర్నించి కార్డు అందుకొన్నాడు.

కొడుకు ఆచూకి తెలిసిందని పంతోషపడాలో, జైల్లో ఎందుకున్నాడోనని ఉందోళన చెందాలో అర్థం కాలేదు. కానీ పరుగున వెళ్లి ఆ సంగతిని ఇంట్లో వాళ్ళకి చెప్పాడు. వెంటనే హైదరాబాద్‌కి బయల్దేరాడు. రెండు గంటలకి జైలు చేరుకొన్నాడు. కొడుకుని కలిశాడు. వివరాలు తెలుసుకొన్నాడు. దుఖం పొంగిపొర్లుకొచ్చింది.

ఆరోజు శనివారం, మొబైల్‌ కోర్టు లేదు. కానీ ఆఫీసులో ఉండా ల్సిందే, అంబర్‌పేట శ్మశానవాటికకి ఎదురుగా ఉన్న సందులోని మారుమూల నింబోలిఅడ్డలో ఉన్న క్వార్టర్ల మధ్య కోర్టు, కోర్టులో సైలెంట్‌గా ఉంది వాతావరణం. ఆనందరావు కష్టంగానే కనుక్కొ న్నాడు. ఆదుర్దాగా లోపలికి వెళ్లాడు. పెద్ద గది. మూడు టేబిళ్లు, నలుగురు మనషులు కూర్చొని ఉన్నారు. టైప్‌ మిషన్‌ కూడా ఉంది. ఏ పనీ లేక బాతాఖానీ కొడ్తున్నారు. మామూలు కోర్టులో ఉండే హడావిడి అక్కడ ఎంతమాత్రమూ లేదు.

మధ్యలో ఉన్న టేబిల్‌ దగ్గర కూర్చొన్న హెడ్‌క్లర్క్‌ దగ్గరికి వెళ్ళాడు ఆనందరావు.

”ఏం కావాలండీ” ప్రశ్నించాడు. కూర్చోమని కుర్చీ చూపిస్తూ.

”జరిమానా కట్టడానికి వచ్చాను” అంటూ కుర్చీలో కూర్చున్నాడు.

”ఎవరిది”

”మా అబ్బాయి శ్రీకాంత్‌ది”

”కేసు నెంబరు ఉందా”

”ఉంది” చెప్పాడు.

క్లర్క్‌ని పిలిచి ఫైల్‌ తీసుకురమ్మని చెప్పాడు. క్లర్క్‌ తెచ్చాడు.

”ఇంత ఆలస్యం చేశారేమిటి?”

”ఈరోజు ఉదయమే ముషీరాబాద్‌ జైలు నుంచి ఉత్తరం వచ్చింది. వెంటనే పరుగెత్తుకొచ్చాను” వివరాలు చెప్పాడు ఆనందరావు.

డబ్బు తీసుకొని వెంటనే రసీదూ, రిలీజ్‌ ఆర్డరూ తయారు చేసి మేజిస్ట్రేట్‌ రూంలోనికి వెళ్లాడు హెడ్‌క్లర్క్‌.

చిన్న గది. మేజిస్ట్రేట్‌ ముందు చిన్న టెబిల్‌. దాన్ని ఆనుకొని రెండు కుర్చీలు. పక్కనే స్టూలు. దానిమీద ఫోన్‌. భారంగా తీరుగుతున్న ఫ్యాన్‌. నిర్వ్యాపకంగా ఉన్న మేజిస్ట్రేట్‌ క్లర్క్‌ సంతకం కోసం రావడంతో ‘ఏంటీ’ అన్నట్లు చూశాడు.

”జరిమానా రసీదు సార్‌” అన్నాడు. రసీదుని కంప్లెయింట్‌ని చూశాడు. పేరు శ్రీకాంత్‌. వయస్సు పద్దెనిమిది. ఫుట్‌ బోర్డు మీద టిక్కెట్టు లేకుండా ప్రయాణం, నేరం ఒప్పుకున్నాడు. నూటయాభై రూపాయల జరియానా. జరిమానా కట్టలేని పక్షంలో పదిరోజుల జైలు. నాలుగు రోజుల నుంచి ఆ అబ్బాయి జైల్లో.

”ఎవరోచ్చారు”

”ఆ కుర్రవాడి తండ్రి వచ్చాడు సార్‌”

”ఏ ఊరు వాళ్లది”

”కామారెడ్డి సార్‌”

”ఇంత ఆలస్యం ఎందుకైంది?”

”వాళ్లకి ఈ రోజే తెల్సిందట సార్‌, ఆ అబ్బాయి  కార్డు రాసాడట జైలు నుంచి”

ఆనందరావు పడిన నాలుగు రోజుల నరకయాతనని మేజిస్ట్రేట్‌కి వివరించాడు హెడ్‌క్లర్క్‌.

మేజిస్ట్రేట్‌కి తల దిమ్మెక్కిపోయింది. రసీదు మీద, విడుదల ఉత్తర్వు మీద సంతకం చేసి వెంటనే జైలుకియ పంపించమని చెప్పాడు. ఆనందరావుని చూడాలనిపించింది. కానీ ధైర్యం చాలలేదు.

ముష్టి నూటయాభూ రూపాయలు అవి లేకపోవడం వలన నాలుగు రోజుల మానసిక నరకయాతన. విలువైన సంవత్సరకాలం గంగలో కల్సిపోయింది. ఆ నరకయాతనకి ఎవరైనా ఖరీదు కట ్టగలరా? ఇంతకి ఆ కుర్రవాడు చేసి నేరమేమిటి? ఫుట్‌బోర్డు మీద టిక్కెట్టు లేకుండా నిల్చున్నాడు. కండక్టర్‌ అప్పిటికింకా వచ్చి ఉండ డు. సరిపయినన్ని బస్సులే ఉంటే ఫుట్‌బోర్డు మీద నిల్చోవాల్సిన ఖర్మేమిటి? నిల్చున్నాడే అనుకో ఆ సంగతి వివరించవచ్చు కదా వివ రిస్తే ఇంకా ఎక్కువ జరిమానా విధిస్తారన్న భయం. ఇంతకి ఎవరిది తప్పు? సరిపోయేటన్ని బస్సులు వేయని ఆర్టీసీదా? అమాయకత్వం వల్ల ఏమీ చెప్పుకోలేక పోయిన ఆ కుర్రవాడిదా?  మొబైల్‌ కోరు ్టల ను ఏర్పాటు చేసిన ప్రభుత్వానిదా? జరిమానా తర్వాత చెల్లించ వ చ్చని చెప్పని క్లర్కులదా? ఎక్కువ జరిమానా విధించిన తనదా? ఎ వరిది తప్పు? తమది తప్పు కాదని చెప్పడానికి ఎవరి కారణాలు వా ళ్లకున్నాయి. అయినా అందరూ కారకులే. పరిస్థితి కూడా కారణ మే. బాధితుడు మాత్రం ఆ కుర్రవాడు. ఒక చిన్న సంఘటన జీవితా న్ని ఎంతచిన్నాభిన్నం చేస్తుంది ఆలోచనల్లో పడ్డాడు మేజిస్ట్రేట్‌.