కార్మికవర్గ పార్టీ, ఆర్థివాదం, రివిజనిజం

రష్యా విప్లవోద్యమ క్రమంలో జరిగిన చారిత్రక పరిణామాలను,భిన్న దృక్పధాల మధ్య చర్యలను వివరిస్తున్నారు

ఇప్పటి కుర్రకారుకి తెలియక పోవచ్చుగాని సుమారు 25 సంవత్స రాల క్రితం వరకు రష్యా నుండి వచ్చే చాల రాజ కీయ సాహిత్య యంలో,రష్యన్‌ విప్లవోద్యమం లెనిన్‌ నాయకత్వం దోరకగానే తిరుగులేని సిద్ధాం తం,ఆచరణలతో సూటిగా సాగిపో యిందనే భావం కల్పించి లెనిన్‌ను పురాణ పురుషునిగా చిత్రించేది. వాస్తవానికి రష్యన్‌ విప్లవం అడు గడుగునా సంక్షోభం,  సిద్దాంత, రాజకీయ ఘర్షణ,చీలి కలు,ఆటు పోట్లనడుమ ముందుకు సాగింది. విప్లవ పార్టీ నిర్మాణం ఇందుకు ఏ రకంగాను మినహాయింపు కాదు. చిన్న చిన్న రహస్య గ్రూపుల నుండి ఒక బలమైన పార్టీగా ఎదిగే క్రమంలో కార్యకర్తల నడుమ జరిగిన సంఘర్షణ రేఖా మాత్రంగా పరిచయం చేసే ప్రయ త్నం ఇది. సరోద్నిజం నుండి ప్లెఖనోవ్‌ నాయకత్వంలో ఏర్పడిన చిన్న మార్కిస్ట్‌ సంస్ధ కృషి వల్ల రష్యాలోకి రహస్యంగా అందిన మార్కి స్ట్‌ రచన ప్రభవంతో పలు ప్రాంతల్లో మార్కిస్ట్‌ అధ్యయన,ప్రచార గ్రూపులు ఏర్పడ్డా యి. 1880-90ల నుడుమ బల్గేరియాకు చెందిన బ్లగోఎవ్‌ నాయక త్వంలో రష్యన్‌ సోషల్‌ డేమక్రాటిక్‌ పార్టి ఏర్పడింది. కజాన్లో ఫెదో సేఎవ్‌ నాయక త్వంలో ముఖ్యంగా విద్యార్ధులు ఒక సంస్ధ ప్రారంభిం చారు.(ఈ సంస్ధ సభ్యుడే లెనిన్‌-అసలు పేరు వ్లాదిమిర్‌ ఉల్యనోవ్‌) శ్రామిక వర్గ విముక్తి పోరాట సంస్ధలు (లీగ్స్‌ ఆఫ్‌ స్ట్రగుల్‌ఫర్‌ ది ఇమానిపేషన్‌ ఆఫ్‌ ది వర్కింగ్‌ కాస్‌)అనే పేరుతో ఈ సంస్ధలు పని చేసేవి. రాత్రి పాఠశాలలో రూపంలో సెన్సార్ల,విద్య ఇన్స్పెక్టర్ల కన్నుగప్పి, ఇవి చదువుతో బాటు మార్కిస్ట్‌ సిద్దాంతం. చరిత్ర సైన్స్‌ పాఠాలు చిన్న చిన్న కార్మిక బృందాలకు నేర్పించేవి. 1890 నాటికి ఈ పని విధాన పరిమితులను నాయకులను గుర్తించ గలిగారు. 1891-92 మధ్య పెద్ద ఎత్తున కరువు,కలరా,విష జ్వార ాలతో దాదాపు నాలుగు కోట్ల మంది చనిపోయారు. ఓల్గా ప్రాంతంలొ గ్రామాలకు గ్రామాలే ఖాళీ చేసి రైతులు పని కోసం పట్టణాలకు తరలారు. ఈపరిస్థితి ప్రభుత్వ, అధికారుల దివాళా కోరుతనం,  అవినీతి బట్ట బయలు చేసింది. ఈ సందర్భంలో కార్మికుల్లో ఆందోళన (ఆజిటేషన్‌) కార్య క్రమం అవసరమైంది. అంటే కోద్ది మందిలో ప్రచారం (ప్రాపగాండ ) నుండి విశాల సమూహాల్లో ఆందోళన పరిమాణం జరిగింది. అదే సందర్భంలో క్రెమర్‌,మార్తోవ్‌ అనే కార్యకర్తలు ఆందోళన గురించి ఆన్‌ ఆజిటేషన్‌ లేక విల్నా పత్రం అనబడే తమ రచనను విడుదల చేశారు. ప్రచారం, ఆందోళన గురించి శాస్రీయ సిద్దాంతీకరణ ఈ సమయం లో ప్లెఖనోవ్‌ జరిపాడు. కోద్ది మందికి భావాలు అందజే యడం ప్రచారం, కాగా విశా ల జనరాశికి పరిమిత భావాలు అంద జేయడం ఆందోళన (ఉదాహరణకు విప్లవ సందర్భంలలో బోల్షివిక్‌ లు ఇచ్చిన సోవియెట్లకు సర్వాధికారాలు, భూమి,ఆహారం, శాంతి నినాదాలు) విల్నా ప్రతంలో రచయితలు కార్మిక విముక్తి కార్మికులే సాధించాలంటే సోషల్‌ డెమాక్రాట్లు (తర్వాత యూరోపులో సంస్క రణ వాదనికి నాయకత్వం వహించి జర్మన్‌ విప్లవానికి ద్రోహం చేసి న పార్టికి ఈ పేరు మిగిలింది.) కార్మిక తక్షణ పోరాటాలకు నాయక త్వం వహించి ఆందొళన కార్యక్రమాలు చేపట్టాలని, కార్మికుల తక్షణ పోరాటాలు అంతిమంగా వారిని సొషల్‌ డెమోక్రాట్లు చైతన్య వంతం గా ఎంచుకున్న లక్ష్యాల వైపు నడుపుతానని వాదించారు. ఆర్ధిక ఆందోళనకి, రాజకీయ పోరా టానికి నడుమ సంబంధం క్రెమర్‌ మాటల్లో కార్మికుల ఉద్యమం ఎంత విశాలమైనప్పటికి, రాజ కీయ పోరాటం జరపనంత వరకు విజయ వంతం కాదు. రాజ్యాధి కారం సాధించడం కార్మికవర్గ రాజకీయ పోరాటానికి గీటురాయి. కాబట్టి కార్మికుల తక్షణ అవసరాల మీద ని రంతరం ఆందోళ చేయడం సోషల్‌డెమొక్రాట్ల కర్తవ్యం. ఈ డిమాం డ్ల మీద జరిగే పోరాటాల వల్ల కార్మికులకు తమ ప్రయోజనాలు రక్షించుకోవా డంలొ శిక్షణ లభించి,సంఘటిత పడవలసిన అవస రాన్ని గుర్తిసా ్తరు. అంతింగా వారు తమ అతి ధ్రానమైన సమస్య పరి ష్కారం వైపు కదులుతారు. (ఆలన్‌ వుడ్స్‌,ది రోడ్‌ టు రెవలూష్యన్‌, పేజీ 97,ఆకార్‌ ప్రచురణ) రహస్య కార్యక్రమాలు నడుపుతూ, నాయ కత్వ శ్రేణులు తరుచుగా అరెస్టులకు జైలు శిక్షలకు గురవుతున్న తరుణంలో అందోళన కంటే అనుభవం లేని నాయకత్వం, కార్య కర్తల చేతిలో ఉద్యమం పెట్టడం అనే భయం కోందరు కార్మికులలో ఉండ గా,అలా భావించడం పూర్తిగా తప్పు కాదని లీగల్‌ మార్కిస్ట్‌, ఆర్ధిక వాదాలు రుజువు చేశాయి. సరోద్నిజంతో పోరాడుతున్న సమయం లో ప్లెఖనోవ్‌కు రష్యాలో విశ్వ విద్యాలయాల మేధా వులతో కోంత సానుభూతి ఏర్ప డింది. నరోద్నిక్‌ కార్యక్రా మాలను అదుపులో పెట్టాలని భావించే మధ్య తరగతి శ్రేణుల ప్రయోజనం వల్ల కోందరు ధని కులు దీనికి వత్తాసు పలికారు. రష్యాలోని లీగల్‌ పత్రికలలో కేవలం చరిత్ర,సామాజిక శాస్రాల చర్చగా కుదించబడ్డ మర్కిస్ట్‌ రచనలు వీరి సహాయంతొ వెలువడేవి. మార్కిస్ట్‌ తత్వశాస్ర ఆర్ధిక,రాజకీయ పదజా లం మృదువైన మారుపేర్లతో రాసిన వ్యాసాలు ఈ పత్రికలు ప్రచు రించేవి,లేదా పుస్తక రూపంలో వీరి సహాయంతో వచ్చేవి. ప్లెఖవోవ్‌ రాసిన చరిత్ర పట్ల అద్వైత (మోని స్ట) దృక్పధం (డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ది మోనిస్ట్‌ వ్యూ ఆఫ్‌ హిస్టరీ)ఇలా వచ్చిన రచనే.దీని అసలు పేరు చారిత్రక భౌతికవాద దృక్పధం అని ఉండాలి.(వ్యాపార పత్రికలలో రాసే మార్కిస్ట్‌ రచయితలకు ఇప్పటి కీ ఈ పాట్లు తప్పవు) విప్లవాలకు విశ్వవిద్యాలయాల మేధావులు, ధనిక మధ్యతరగతి శ్రేణుల సహకా రం అవసరమైన ఈ పరిస్ధితిలో పి.బి.స్ట్రువ్‌,బుల్గాకోవ్‌,టుగాన్‌ బరనోవ్స్కి వంటి ఆర్ధికవేత్తలు. మేధా వులు వర్గ పోరాటానికి దూరమైనా అకాడమిక్‌ మార్కిజానికి తెరలే పారు. నరోద్నిజంపై విజయం సాధిం చిన మార్కిస్ట సిద్దాంతంలో వారికి రష్యాలో పెట్టుబడిదారీ విధాన అభివృద్ది జరుగుతుందనే వాదన వచ్చింది. దీనిని బహుముఖంగా (గతితార్కికంగా) చూడ కుండా కుదించి,కార్మిక వర్గం బూర్జవా వ్యవస ్ధకు వ్యతిరేకంగా పోరాటం అంటే బూర్జూవా ప్రజాస్వామ్యం కోరకు పోరాటం.కాబట్టి కార్యిక వర్గం సాధ్యంగాని పగటికలలు వదిలేసి బూర్జువా ఉదార వాదులకు సహకరించి కోత్త సమాజాన్ని నిర్మించాలి. ఇక్కడ కని పించే విప్లవం పట్ల రెండు పరస్పర విరుద్దమైన వైఖరులు. సంస్కర ణా లేక మౌలిక మార్చా? అన్య వర్గాలతో రాజీయా లేక స్వ తంత్ర కార్మిక వర్గ విధానమా? అగ్రగామి వర్గమైన కార్మిక వర్గ సి ద్దాంతం ఇతర వర్గ సిద్దాంతాలతో రాజీ పడకూడదు.వీరికి జవాబు గా లెనిన్‌ కార్మికవర్గ స్వతంత్ర పాత్రను ఇలా సిద్దాంతీకరించాడు. యూరోప్‌ నుండి తూర్పు వెళ్లిన కోద్దీ,రాజకీయ రంగుంలో బూర్జువా వర్గం మరింత బలహీనంగా, పిరికిగా,సంకుచితంగా మనకు కనబ డుతుంది. అలాగే కార్మిక వర్గం మోయవలసిన రాజకీయ సాంస్క తిక భారం మరింత పెరుగుతుంది. రష్యన్‌ కార్మిక వర్గం తన భుజ స్కంధాల పైన రాజకీయ స్వేచ్చను సాధించే భారాన్ని కూడా మోయ వలసి ఉంది. ఇది కార్మిక వర్గం తన చారిత్రక కార్తవ్యాన్ని మనిషిక ిమనిషి దోపిడి చేయని వ్యవస్ధను సాధించే మార్గంలో మొదటి అడు గు మాత్రమే. (ది రోడ్‌ టు రెవల్యూషన్‌, పేజీ89) వీరిలో స్ట్రువ్‌ కోం త కాలం విప్లవం వైపు మొగ్గి,మొదటి విప్లవ పార్టి మహాసభ మాని ఫెస్టో రాశాడు.

కె.నరేంద్రమోహన