వాణిజ్య పన్నులశాఖ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ సాయినగర్‌లో నివసిస్తున్న వాణిజ్యపన్నులశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వర్లు బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ రూ. 5కోట్ల విలువైన అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.