గరిష్ఠస్థాయికి చేరుతున్న నీటిమట్టం

శ్రీశైలం: కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుండటంతో నీటిమట్టం గంటగంటకు పెరుగుతోంది. ఆలమట్టి, నారాయణపూర్‌, జూరాల జలాశయాల్లో నీటిమట్టాలు గరిష్ఠస్థాయికి చేరుతుండటంతో ఎప్పటికప్పుడు అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల, తుంగభద్ర నుంచి 2,71,872 కూసెక్కుల వరదనీరు శ్రీశైలం జలాశయంలో చేరుతుండటంతో నీటిమట్టం క్రమేసి పెరుగుతుంది. జలాశయానికి నీటి ప్రవాహం ఇలాగే కొనసాగితేమరో వారం రోజుల్లో నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరే అవకాశం ఉందని నీటి పారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. జూరాల జలాశయం ఇన్‌ఫ్లో లక్షా 82వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,83,656 కూసెక్కులుగా ఉంది. తుంగభద్ర జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1631.89 అడుగులకు చేరింది.