చనిపోయిన నెమలి చెత్తకుప్పలో లభ్యం
హైదరాబాద్ : బోరబండ మోతినగర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు చనిపోయిన నెమలిని చెత్తకుప్పలో వేసి వెళ్లారు. ఇది గమనించిన ఓ బాలుడు దానిని పోలీసులకు అప్పగించాడు. ఉదయమే మోతినగర్ సైట్-2 నుంచి నర్సింహ అనే బాలుడు వెళ్తుండగా అదే దారిలో ఆటోలో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు చనిపోయిన నెమలిని చెత్తకుప్పలో వేసి వెళ్లిపోయారు. ఇది గమనించిన బాలుడు చనిపోయిన నెమలిని తీసుకుని బోరబండ ఔట్‌పోస్టు పోలీసులకు అందించాడు. నెమలిని అటవీశాఖ అధికారులకు అప్పగించి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.