పీవీ రంగారావు కు సీఎం నివాళులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు ఉదయం తుదిశ్వాస వదిలిన మాజీ మంత్రి పీవీ రంగారావు నివాసానికి చేరుకుని ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. శాసనసభ, శాసనమండలి స్పీకర్లు నాదెండ్ల మనోహర్‌, చక్రపాణి, విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు , రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్‌, భాజపా నేత దత్తాత్రేయ, విద్యావేత్త చుక్కా రామయ్య, ఎమ్మెల్సీ రంగారెడ్డి తదితరులు పీవీ రంగారావు భౌతికకాయానికి నివాళులర్పించారు.