ఒక్క చిన్న

– ఒక్క చిన్న నిప్పు రవ్వ

అడవంతటిని దహించినట్టు

ఒక్క చిన్న రంధ్రం పడవను

నట్టేట ముంచినట్టు

ఇనుముకు తుప్పు కర్రను చెదలు

ఆరోగ్యానికి ఉప్పు మెత్తంగా ముప్పు

– దశరథుడు కైకేయికకిచ్చిన

అనాలోచిత వరం ఒక చిన్న తప్పు

శ్రీరాముని అడవుల పాల్జేయడం

రజకుని ప్రేలాపనకు స్పందించిన

రాముడు సీతను అడవికి పంపడం

ఒక్క చిన్న తప్పులో ఇప్పటికీ

మహిళాలోకాన అపఖ్యాతి పాలవడం

రావణబ్రహ్మగ కీర్తించబడే

పరస్త్రీ మాతృ సమానురాలనే

ఇంగితాన్ని విస్మరించిసీతను

చెరపట్టడం ఒక్కతప్పు

అతణి అతని సామ్రాజ్యాన్ని

నాశణం చేయడం

-రాణా ప్రతాప్‌ సింగ్‌

అక్బరు సైనికబలాన్ని తక్వు

అంచానా వేసిన ఒక్క చిన్న తప్పు

తనను పరాజతుణ్ణి జేస్తూ

లక్షలాది సైనికుల నెత్తురు

ఏరులై పారించడం

– చదరంగంలో వేసే ఒక్క ఎత్తు

తప్పైతే ఆటలో చిత్తు

ఓప్పైతే విజేత

ఒక్క చిన్న విషపు చుక్క

కడివెడు పాలు విషతుల్యం

జేసినట్లు ఒక్క చిన్న తప్పు

వ్యక్తిని అధ పాతాళానికి తోసేస్తుంది

వ్యక్తిఆ్వన్ని భ్రష్టు పట్టిస్తుంది

మానవత్వాన్ని మంటగలుపుతుంది

అందుకే ఒక్క చిన్న తప్పు జరగకుండా

తస్మాత్‌ జాగ్త్రీ

-చింతలఫణి వేంకటేశ్వర్‌ రెడ్డి