క్రీడా పోటీల షెడ్యూల్‌ ప్రకటన

ఆదిలాబాద్‌ ,ఆగస్ట్‌ 2:

కాకతీయ యూనివర్శిటీ క్రీడాజట్ల ఎంపిక పోటీల తేదీల షెడ్యూల్‌ ప్రకటించారు. జిమ్నాస్టిక్‌ పోటీలు సెప్టెంబర్‌ 17న, టెన్నిస్‌పోటీలు 18న, ఈత పోటీలు 29న జరుగుతాయని పేర్కొన్నారు. ఆర్చరీ పోటీలు అక్టోబర్‌ 4న, కనోయింగ్‌, కయాకింగ్‌, బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలు అక్టోబర్‌ 10న నిర్వహిస్తారని చెప్పారు. హాకీ పోటీలు డిసెంబర్‌ 16న సైక్లింగ్‌, జూడో పోటీలు జనవరి 4న, బాక్సింగ్‌ పోటీలు జనవరి12న, వెయిట్‌లిప్టింగ్‌, పవర్‌లిప్టింగ్‌ (మహిళలు) పోటీలు జనవరి 16న, వెయిట్‌లిప్టింగ్‌, పవర్‌లిప్టింగ్‌, బె/-టస్‌ ఫిజి/-ళ పోటీలు జనవరి 17న జరుగుతాయని వివరించారు. పోటీలు వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీ మైదానంలో ఉంటాయన్నారు. జిల్లాలోని క్రీడాకారులు ఆయా తేదీల్లో ఉదయం 7గంటలకు, తగు ధ్రువీకరణ పత్రాలతో రిపోర్టు చేయాలని కోరారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ ఎంట్రీలను ఈనెల 14వ తేదీ వరకు అందజేయాలని సూచించారు.